విశాఖపట్నం

టీబీ ఆసుపత్రిలో మూలకు చేరిన డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూలై 19: కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఖరీదైన వైద్య పరికరాలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచినా రోగులకు సేవలు అందడం లేదు. పరికరాలు చెడిపోయినా అధికారులు పట్టించుకొవడం లేదు.దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. నగరంలోని ప్రభుత్వ టీబీ ఆసుపత్రిలో రెండు నెలలుగా డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆత్యాధునిక డిజిటల్ విధానంతో తయారు చేసిన ఈ వైద్య పరికరం మూలనపడి నెలలు గడుస్తున్నా ఆసుపత్రి యాజమాన్యం కనీసం స్పందించకపోగా, రోగుల ఇబ్బందుల దృష్ట్యా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు. మూడు జిల్లాల నుంచి రోజు నిత్యం వంద నుంచి రెండు వందల మంది రోగులు టీబీ, ఇతర వ్యాధులతో బాధపడే వారు ఆసుపత్రి తనిఖీ నిమిత్తం వస్తుంటారు. సాధారణంగా ఆసుపత్రిలోనే ఎక్స్‌రే మిషన్ పనిచేస్తే ఓపీ సేవలకు వచ్చిన రోజే రోగి ఏ సమస్యతో బాధపడుతున్నారో అనే విషయాన్ని తెలుసుకొని మందుల అందించే అవకాశం ఉంది. మిషన్ పనిచేయకపొవడంతో రెండు, మూడు సార్లు ఆసుపత్రి చూట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో ఉన్న వైద్య పరికరాలు నిర్వహాణ బాధ్యతను టీసీ ఎస్ సంస్థకు అప్పగించారు. దీంతో వారు ఏ ఆసుపత్రిలో వైద్య పరికరాలు చెడిపోయినా వాటిని సకాలంలో బాగుచేసి అందివ్వాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకొవడం లేదు. ఆయా సంస్థలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పరికరాల మరమ్మత్తులు చేపట్టకపొవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆసుపత్రి ఉన్నతాధికారులు సైతం ఆసుపత్రి అభివృద్ధి నిధులు నుంచి వెచ్చించి బాగు చేయడానికి ఇష్టపడకపోవడంతో నిత్యం టీబీ ఆసుపత్రికి వచ్చే రోగులకు మ్యానువల్ పద్దతిలోనే ఎక్స్‌ర్‌లు తీయడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థి ఏర్పడింది. ఇప్పటికైనా ఆసుపత్రి సూపరిండింటెంట్ రోగులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఖీరుదైన వైద్య పరికరాలను మరమ్మత్తులు చేపట్టాలని పలువరు కోరుతున్నారు.