విశాఖపట్నం

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మంటకలుపుతున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూలై 19: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు మంటగలపుతున్నారని తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. గురువారం నగరంలో ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంతోనే నడుస్తుందని బీజేపీ ఎంపీ జీవీ ఎల్ నరసింహరావు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ కాదని..్భరతీయ జిమిక్కుల పార్టీన్నారు. ఏపీకి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా ఏదో ఒక కుంటిసాకుతో తప్పించుకుంటున్నారన్నారు. అలాగే కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏడు నెలల నుంచి రాష్ట్రాన్ని అడుగుతున్నా పట్టించుకొవడం లేదన్నారు. కేంద్రం చేపట్టిన చర్యలే వల్లే ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలి స్థానంలో నిలిచిందని మాట్లాడం సరికాదున్నారు. ఏపీలో పారదర్శకత, అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాసం తీర్మాణాన్ని ప్రవేశపెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలపుకొని మద్దతు కూడగడతానని గతంలో ప్రకటించారని, శుక్రవారం అవిశ్వాసం ప్రవేశపెడుతుంటే ఆయన ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం మాట్లాడకుండా కేవలం బీజేపీ అధిష్టానం చెప్పినట్లే వ్యవహరిస్తున్నారని విషయం అర్థమవుతుందిన్నారు.కేవలం అధికారం కోసమే జగన్, పవన్ మోడికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడటం లేదున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఆ రెండు పార్టీలకు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దువ్వారపు రామారావు, రైల్వే యూనియన్ నాయకులు మెహాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి
జగదాంబ, జూలై 19: ఆంధ్రాయూనవివర్శిటీలో చదువుతున్న బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ సకాలంలో అందించాలని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జంగా క్రిష్ణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఏయూలో బీసీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ.1,400 మాత్రమే అందిస్తున్నారని, మెస్ బిల్లులు రూ.2,500 వస్తుందని,తక్షణమే పెరిగన ధరల నేపథ్యంలో స్కాలర్‌షిప్‌ను రూ.2,500 పెంచాలన్నారు. పేద విద్యార్థులంతా ఉన్నత చదవులు చదువుకొవాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో టిక్కెట్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, బీసీ విద్యార్థులకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 300 మందికి ఓబీసీ ఫెలోషిప్‌లు ఇస్తున్నారని వాటిని మూడువేలుకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మోహన్‌బాబు, కళ్యాణ్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రశేఖర్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు పాత్రుడు, ఉత్తరాంధ్ర విద్యార్థిసేన అధ్యక్షుడు పితాని ప్రసాద్, పలువరు విద్యార్థులు పాల్గొన్నారు.
బర్మా కాందిశీకులకు న్యాయం చేయాలి
జగదాంబ, జూలై 19: దశాబ్థాల కాలంగా నగరంలో నివశిస్తున్న బర్మాకాంధీశీకులకు ప్రభుత్వం తక్షణ న్యాయం చేకుర్చాలని వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బర్మాకాంధీశీకు పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కప్పరాడ వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయ కూడలిలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి, వారి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ప్రసాద్ మాట్లాడుతూ బర్మాకాంధీశీకులకు గృహలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 38వ వార్డులో వారికోసం ఆనాడు నోటిఫీకేషన్ ఇచ్చి 9.5 ఎకరాల భూమిని కేటాయించారన్నారు. అందులో సుమారు ఆరు ఎకరాలు కబ్జాకు గురైందన్నారు. మిగిలిన ఒకటిన్నర ఎకరాల్లో టిడ్కో ద్వారా 160 మంది బర్మాకాంధీశీకులకు గృహ వసతి కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే దానిని కూడా భూకబ్జాదారులు అడ్డుకుంటున్నారని, నకిలీ పత్రాలతో ఆ భూమిని కబ్జాచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ఆరు రోజులుగా బర్మాకాంధీశీకులు నిరాహర దీక్ష చేస్తున్నా వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉన్నారంటే అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బర్మాకాంధీశీకులను ఆదుకుంటామని, వారి సమస్యను పరిష్కరించే విధంగా జగన్ దృష్టికి తీసుకువెళ్లతామని హామీ ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని లేకుంటే వైసీపీ తరుపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బర్మాకాంధీశీకుల పునరావాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాయణరావు, ప్రధాన కార్యదర్శి డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సదరంలో బాలలకు తొలి ప్రాధాన్యతనివ్వాలి
జగదాంబ, జూలై 19: దివ్యాంగుల కోసం వచ్చే నెల మూడో తేది నుంచి ఏపీ వైద్యవిధాన పరిషిత్ ద్వారా ప్రతీ శుక్రవారం కేజీహెచ్‌లో వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారికి నిర్వహించే సదరం ధృవీకరణ పత్రాల కోసం వచ్చే బాలలకు తొలి ప్రాధాన్యత కల్పించాలని చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారామ్ కేజీహెచ్ సూపరిండింటెంట్‌కు విజ్ఞప్తి చేశారు. గడిచిన వారం రోజులుగా కేజీహెచ్‌లో నిర్వహించిన సదరం వైద్యశిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కేజీహెచ్ వైద్యాధికారుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ సదరం ధృవీకరణపత్రాలు త్వరితగతిన జారీ, ప్రత్యేక క్యాంపుల నిర్వహాణలో జిల్లా అధికారులు, కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులను సమాయత్తుపరచి విజయవంతం అయ్యేలా సహకరించిన సీ ఆర్‌ఫీ ఎఫ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఆర్‌ఫీఎఫ్ అధ్యక్షుడు సీతారామ్ మాట్లాడుతూ సదరం శిబిరం ద్వారా 1024 మంది దివ్యాంగులకు వైకల్య నిర్థారణ చేసి ఆన్‌లైన్ ద్వారా పత్రాలు జారీ చేయడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ ఆర్‌ఎంలు డాక్టర్ బంగారయ్య, శాస్ర్తి, పోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శకుంతల, జిల్లా ఉపాధ్యక్షుడు తిర్లంగిహరి, ప్రధాన కార్యదర్శి జీవీకుమార్, సభ్యులు కె. ఎల్లయ్య, హేమసుందర్, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.