విశాఖపట్నం

ఆరోగ్యశాఖలో యుడీసీల విధులు చుట్టం చూపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 13: అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుతో సరిపోలిస్తే వైద్య ఆరోగ్య శాఖ పనితీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. ఇటు అభివృద్ధిలోనైనా, అటు అవినీతిలోనైనా వారిదే పైచేయిగా పేర్కోనవచ్చు. జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 90 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉన్నాయి. వీటిలో కార్యాలయ పరిపాలనా పరమైన విషయాలతో పాటు, అక్కడ పనిచేసే వైద్యుని నుంచి దిగువ స్ధాయి సిబ్బంది వరకూ ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన జీతాలు, ఇంక్రిమెంట్లు, ఫీఎఫ్, సర్వీస్ రికార్డులు ఇతర వాటికి సంబంధించిన విషయాలను పర్యవేక్షించాల్సిన యుడీసీ( అప్పర్ డివిజన్ క్లర్క్)లు చుట్టం చూపుగా విధులు నిర్వహించడంతో ఆయా పీహెచ్‌సీల సిబ్బంది వారి కార్యాలయ పనులు జరగక తీవ్ర ఇబ్బందలు ఎదుర్కోంటున్నారు. కేవలం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ విధంగా యుడీసీలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి చెప్పాలంటే సాధారణ ఉద్యోగుల మాదిరిగానే వీరు కూడా వారం రోజులు పనిచేయాలి. కానీ ఈ యూడీసీలు నెలలో వారం రోజులు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. మరో విశేషం ఏమిటంటే కాస్తోకుస్తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారంతా కార్యాలయాలకు వెళ్లకుండా ఆయా రికార్డులను ఇంటిలోనే పెట్టుకోని తమ ఇంటి నుంచే కార్యాలయ పనులు చక్కబెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని పీహెచ్‌సీల్లో పనిచేసే యూడీసీలైతే నిత్యం జిల్లా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ ఆయా పీహెచ్‌సీలకు సంబంధించిన పనులు చేయించుకొవడం గమనర్హం. జిల్లాలోని ప్రస్తుతం 61 మంది యుడీసీలు విధులు నిర్వర్తించగా, వీరిలో కొంత మందికి రెండు నుంచి మూడు పీహెచ్‌సీలు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా ఆ పీహెచ్‌సీ, ఈ పీహెచ్‌సీ పనులు ఉన్నాయంటూ ఓడీలు, ట్రేజరీ పనుల పేరిట కాలం గడుపుతుండటం విశేషం. అయితే ఇటీవల ఆనందపురం పీహెచ్‌సీకి సంబంధించిన యుడీసీ వారంలో ఒక్క రోజు కూడా విధులకు హాజరుకావడంతో పలువరు ఉద్యోగులు కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే ఆయా పీహెచ్‌సీలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన జీతాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు, పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించడంతో పీహెచ్‌సీల్లో యుడీసీల పనితీరు ఏ విధంగా ఉంది అనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఏజెన్సీలో లుంగపర్తి పీహెచ్‌సీకి చెందిన యుడీసీ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో ఆయా గర్భిణీలకు అందాల్సిన ప్రయోజనాలు అందక ఆయా గ్రామస్థులు నేరుగా ఐటీడీఎ ప్రాజెక్టు అధికారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు.దీంతో ఐటీడీఎ పీఓ కూడా ఈ విషయంపై విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని జిల్లా ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించినా నేటికి కనీస చర్యలు చేపట్టక పోవడం గమనర్హం. నగరంలోని టీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ యుడీసీ విధులకు సక్రమంగా హాజరుకాని కారణంగా మూడు నెలల పాటు జీతాలను సైతం నిలిపివేశారు. వాస్తవానికి జిల్లా కార్యాలయంలో ప్రతీ నెల ఏడో తేదిన జిల్లా అధికారులు ఏ ఏ పీహెచ్‌సీల్లో ఏ ఏ రికార్డులు నిర్వహిస్తున్నారు? తదితర వాటి గురించి ఆరా తీస్తారు. ఈ సమయంలో వారంతా తప్పుడు నివేదకలను అందిస్తున్నప్పటికీ వాటిపై కనీసం విచారణ నిర్వహించకపోవడంతో విచారకరం. అయితే కేవలం యూడీసీ నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడంతోనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధులను సైతం ఖర్చు చేయలేకపోతున్నా సందర్భలు లేకపోలేదు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ఉన్నతాధికారులు పీహెచ్‌సీల్లో యుడీసీలు సక్రమంగా విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్‌ను వివరణ కోరగా విధులకు హాజరుకాని యుడీసీలపై నేరుగా తమను కలిసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అంతేకాకుండా కార్యాలయ అధికారులను కూడా తనిఖీలు నిర్వహించి విధులకు హాజరుకాకపోతే క్రమశిక్షణా చర్యలు చేపడతామన్నారు.