విశాఖ

వాయిద్య కళాకారులను ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 14: వాయిద్య కళాకారులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింధ సత్యనారాయణ భరోసా ఇచ్చారు. స్థానిక రింగురోడ్డు నెయ్యిలవీధి కల్యాణ మంఢపంలో విశాఖ గ్రామీణ జిల్లా వాయిద్య కళాకారుల పదవ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే పీలా ముఖ్య అతిధిగా విచ్చేసి ఉపన్యశించారు. అనకాపల్లిలో వాయిద్య కళాకారులకు ఐదు సెంట్ల స్థలం కేటాయిస్తానని, వారికి ఐదులక్షల వ్యయంతో సామాజిక భవన నిర్మాణ పనులకు ఈనెలలో శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. వాయిద్య కళాకారులకు గుర్తింపుకార్డులు అందేలా చూస్తానన్నారు. అర్హులైన డప్పు కళాకారులకు పించన్‌లు అందజేస్తారన్నారు. సంగీత కళాశాల ఏర్పాటు విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళతానన్నారు. వాయిద్య కళాకారులకు గుర్తింపుకార్డుల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాయిద్య కళాకారుల సమస్యలను సిఎం చంద్రబాబు దృష్టికి సత్వరమే తీసుకెళతానన్నారు. అర్హులైన వారందరికీ పక్కాగృహాలు, రేషన్‌కార్డులు తదితర సమస్యలన్నీంటిని పరిష్కరిస్తానన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ మాట్లాడుతూ వాయిద్య కళాకారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఎస్‌విడిఎస్ కార్యదర్శి కర్రి జోగినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాయల మురళీ, అర్బన్ దేశం ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి కొణతాల రత్నకుమారి, జిల్లా వాయిద్య కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పేలూరి సత్యనారాయణ, బొగ్గారపుజగన్నాథం, రిటైర్డ్ సబ్ ఇనస్పెక్టర్ కేశకుర్తి అప్పారావు తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి పాట గాయనీ అనకాపల్లికి చెందిన గంటా లక్ష్మిని ఈ సందర్భంగా సత్కరించారు. పలువురు వాయిద్య కళాకారులను సంఘం తరపున సత్కరించారు.

నేడు ఉత్తమ విద్యార్థుల అభినందన సభ
అనకాపల్లి, ఆగస్టు 14: వివిధ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉత్తమ విద్యార్థుల అభినందన సభ స్థానిక డిసిఎంఎస్ ప్రాంగణంలో బుదవారం సాయంత్రం జరుగుతుంది. మాదేటి ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతీయేటా విధిగా జరిగే ఈ కార్యక్రమానికి అనూహ్య సంఖ్యలో విద్యార్థులు తరలిరావాలని మాదేటి ఎడ్యుకేషనల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ మాదేటి రామ్‌గాంధీ తెలిపారు. ఈ సదస్సుకు హైదరాబాద్ నుండి విచ్చేస్తున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి అనే అంశాలపై స్పూర్తిదాయకమైన ప్రసంగం చేస్తారని ఆయన తెలిపారు.