విశాఖ

బాహ్య సౌందర్యానికి బానిస కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 14: బాహ్య సౌందర్యానికి బానిసై తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ విద్యార్థులకు హితవు పలికారు. ఏ క్షణంలో ఎలా ఉండాలో అలా ఉండాలని అటువంటప్పుడే తమ జీవితాన్ని ఉన్నత మార్గంలో తీర్చిదిద్దుకుని మంచి ఉజ్వల భవిష్యత్తును పొందగలరని ఆయన పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక కొణతాల సుబ్రహ్మణ్యం హాలులో హిమశేఖర్ విద్యార్థులతోను, ఎఎంఎఎల్ కళాశాలలో ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోను, కశింకోటలోని ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ విద్యార్థులతోను జెడి సమావేశమై వారికి దిశానిర్ధేశం చేసారు. ప్రతీ ఒక్కరూ అంతఃకరణ శుద్ధితో పనిచేస్తే తమ జీవితాన్ని బాగా తీర్చిదిద్దుకోగలరన్నారు. తమవలన సమాజానికి మేలు జరగాలంటే మానవ విలువలు పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ వ్యక్తి తన జీవితమనే పరీక్షలో నెగ్గాలని, ప్రపంచ దేశాలు ఉపయోగించే ఉత్పత్తులు మేడిన్ ఇండియా కావాలని ఆయన ఆకాంక్షించారు. బద్దకం, నిత్య ప్రణాళిక శుభ్రత, ఆతిధ్య సేవనం, సత్యవాక్కు పాలన, శాంతి, బ్రహ్మచర్యం వంటి సద్గుణాలు కలిగితే ఆనందమయ జీవితాన్ని అనుభవించవచ్చని, సమాజ హితానికి పనిచేసే పౌరులు కావచ్చని విద్యార్థులకు హితవుపలికారు. ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు వంటి వాటితో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ప్రతీ విద్యార్థి నిరంతరం ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం చేయడం ద్వారా మంచి సత్ప్రవర్తనను పొందవచ్చన్నారు. హిమశేఖర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కొణతాల జనార్ధన్, సమాజ హితం కోరే పుస్తకాన్ని జెడికి బహుమానంగా ఇచ్చారు. ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో వర్తకసంఘ అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ నేతృత్వంలో జెడి లక్ష్మీనారాయణను కళాశాల విద్యార్థులు, కరస్పాండెంట్, వర్తక ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కశింకోటలోని ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బి. ఉమామహేశ్వరరావు నేతృత్వంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఆర్‌ఇసిఎస్ చైర్మన్ మలసాల రమణారావు ఘనంగా సత్కరించారు.