విశాఖపట్నం

కర్మయోగికి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖ నగరం ఘన నివాళులర్పించింది. కర్మయోగిగా కీర్తినందుకున్న దివంగత వాజ్‌పేయి సైకత శిల్పాన్ని ఆర్కే బీచ్‌లో తీర్చిదిద్ది నివాళులర్పించారు. బీజేపీ, టీడీపీ, ఏబీవీపీ సహా పలు విద్యా సంస్థల్లో వాజ్‌పేయి మృతికి సంతాపం తెలుపుతూ ఘన నివాళులు అర్పించారు.
బీజేపీ కార్యాలయంలో
నగర బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు. విశాఖ ఎంపీ కే హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెసేతర ప్రధానిగా మూడు పర్యాయాలు సారధ్యం వహించడం ఆయన ఘనతగా పేర్కొన్నారు. వాజ్‌పేయి నిరాడంబర జీవితం ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాజకీయాల్లో నైతికతకు, నిరాడంబరతకు వాజ్‌పేయి వంటి నాయకులు స్ఫూర్తినిస్తారన్నారు. తన యవత్ జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారని, శత్రు దేశాలకు సైతం స్నేహ హస్తం అందించడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞతను వాజ్‌పేయి పాటించారన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు ధీటుగా జనసంఘ్‌ను ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి, జనతాపార్టీ పతనానంతరం బీజేపీ ఆవిర్భావానికి ఆయన చూపిన చొరవ ఇప్పటికీ మరిచిపోలేమన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నీతి, నిబద్ధత కలిగిన నాయకుణ్ణి కోల్పోవడం భారత జాతికే కాకుండా బీజేపీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు. ప్రధానిగా ఒక్క ఓటుతో పదవిని కోల్పోతానని తెలిసినప్పటికీ ఎటువంటి ప్రలోభాలకు అవకాశం ఇవ్వకుండా హుందాగా పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహోన్నత వ్యక్తిత్వత్వం వాజ్‌పేయి సొంతమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నగర పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర సారధ్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో దివంగత ప్రధాని వాజ్‌పేయికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గణేష్‌కుమార్ మాట్లాడుతూ నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన దివంగత ప్రధాని వాజ్‌పేయి నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రధాతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జగదీష్, నాగేశ్వర రావు, భువన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో
నగర టీడీపీ ఆధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో దివంగత ప్రధాని వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు.
ఆర్కే బీచ్‌లో కర్మయోగి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలకు పెద్ద పీట వేసిన మహోన్నత రాజకీయ వేత్తగా వాజ్‌పేయిని కీర్తించారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి దౌత్య వ్యవహారాలు దేశ ప్రతిష్టను ఇనుమడింపచేశాయన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు చోడే పట్ట్భా తదితరులు పాల్గొన్నారు.
గీతంలో వాజ్‌పేయికి ఘన నివాళి
మాజీ ప్రధాని వాజ్‌పేయికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఘన నివాళులర్పించారు. గీతం స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్‌లో గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు దివంగత ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న వాజ్‌పేయి ధృవతారగా దేశ యువతకు స్ఫూర్తిని చేకూర్చారన్నారు. రాజనీతిజ్ఞత, సహనం, విలువలు, మానవత్వం, దేశభక్తి కలబోసిన భారతీయుడు వాజ్‌పేయిగా కొనియాడారు. ఆయన మరణంతో భారతమాత ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కే శివరామకృష్ణ, ఎం పోతరాజు, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.