రాష్ట్రీయం

కళ్లుచెదిరే ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లకు పడగెత్తిన సబ్ రిజిస్ట్రార్!

విశాఖపట్నం, డిసెంబర్ 29: విశాఖ నగరంలో ఇటీవల ఏసిబి అధికారుల దాడులు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ, అక్రమంగా భారీ ఎత్తున కూడబెట్టిన ఆస్తులు ఈ దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల ఇళ్ళపై ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ దాడులు జరపగా కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తాజాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌కుమార్ ఆస్తులపై ఏసిబి అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఆనంద్‌కుమార్ మంగళవారం నుంచి ఐదు రోజులు సెలవులో వెళ్లడంతో, ఆయన ఇంటిని ఏసిబి అధికారులు సీజ్ చేశారు. ఏసిబి డిఎస్పీ రామకృష్ణ కథనం ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన ఆనంద్‌కుమార్, అనతికాలంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా, కొద్ది కాలం కిందటే సబ్ రిజస్ట్రార్‌గా పదోన్నతి పొందాడు. విధి నిర్వహణకు సంబంధించిన ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు విశాఖ నగరంలోని ఏడు చోట్ల, ఆనంద్‌కుమార్ స్వస్థలం నర్సాపూర్ దగ్గర కొప్పర్రులో ఆయన బంధువుల ఇళ్ళపై మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారు.
విశాఖలోని లాసన్స్ బే కాలనీలో నాలుగు అంతస్థుల భవనాన్ని ఆనంద్ నిర్మించారు. ఆనంద్‌కుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆ ఇంటిని ఏసిబి అధికారులు సీజ్ చేశారు. సాగర్‌నగర్‌లో డాక్యుమెంట్ విలువను తగ్గించి ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, త్రీ బెడ్ రూం డ్యూప్లెక్స్ ఇంటిని నిర్మిస్తున్నారు. దీని విలువ సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. ఎంతలేదన్నా మార్కెట్ విలువ కోటిన్నర రూపాయలు ఉంటుందని చెప్పారు. భీమిలిలో 85 సెంట్ల స్థలంలో అత్యంత ఖరీదైన ఫాం హౌస్‌ను కుమార్ నిర్మించుకున్నాడు. ఈ స్థలాన్ని అతని తండ్రి, తమ్ముడు, బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. ఈ ఫాం హౌస్ మార్కెట్ విలువ కనీసం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
పోతిన మల్లయ్యపాలెం ఎస్సీ కాలనీలో బినామీ పేర్లతో నాలుగైదు స్థలాలు ఉన్నట్టు కనుగొన్నారు. స్వస్థలమైన కొప్పర్రులో ఐదు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నట్టు ఏసిబి అధికారులు కనుగొన్నారు. అలాగే ఆఫీసులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రమేష్ ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి. సోదాల్లో ఇప్పటి వరకూ బయట పడిన ఆస్తుల విలువ సుమారు 10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.