విశాఖ

విఘ్నేశ్వరాలయంలో మాలాదారణ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, సెప్టెంబర్ 12: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో బుదవారం భక్తులు గణపతిమాలలు ధరించారు. నవరాత్రులలో మాలాదారులు గణనాథునికి ప్రత్యేక పూజలు, భజనలు నియమనిష్టలతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తొమ్మిదిరోజులు భక్తిశ్రద్ధలతో దీక్షాదారులు పూజలు చేస్తే స్వామివారి కరుణతో కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి గణేష్ తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఈ ఆలయంలో భక్తులు మాలాదారణలు జరుగుతున్నాయన్నారు. మండల దీక్షలు, అర్ధమండల దీక్షలు 11రోజులు భక్తులు చేపట్టి విఘ్నేశ్వర స్వామిని పూజించి స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో, కాణిపాక విఘ్నేశ్వరాలయాలలో దీక్షా విరమణలు చేస్తారన్నారు. అంతకుముందు గురుస్వాములు, గణేష్ భక్తులచే స్వామివారి మూలవిరాట్‌కు విశేష అభిషేక పూజలు చేసి వేదమంత్రాల నడుమ మాలలు దరించారు.
పట్టణంలో వినాయక చవితి సందడి - పెరిగిన పూజాసామాగ్రీ ధరలు
చోడవరం, సెప్టెంబర్ 12: పట్టణంలోని పలు కూడళ్లు పూజా సామాగ్రీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గురువారం వినాయక చవితి పర్వదినం కావడంతో స్థానిక కొత్తూరు జంక్షన్, ఆంధ్రాబ్యాంక్ జంక్షన్, పాతబస్టాండ్, గవరవరం రోడ్డు, చీడికాడ రోడ్డు తదితర ప్రాంతాలలో తాత్కాలిక షెడ్లు వేసి పూజాసామాగ్రీ విక్రయాలు జరిపారు. పట్టణంతోపాటు పరిసర గ్రామాల నుండి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చి పూలు, పత్తిరి, పూజాసామాగ్రీ కొనుగోలు చేస్తుండటంతో ఆయా కూడళ్లు సందడి సందడిగా కనిపించాయి. గతేడాది కన్నా ఈ ఏడాది పళ్లు, కొబ్బరికాయలు, అలంకరణ సామాగ్రీ ధఱలు అధికంగా ఉన్నాయంటూ భక్తులు వాపోయారు. ఏదిఏమైనా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతోపాటు పూజాసామాగ్రీ ధరలు కూడా అధికంగా ఉండటంతో మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది.