విశాఖ

వ్యాధులను అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 12: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధులను అరికడదామని ఎం ఇ ఓ బోడంనాయుడు పిలుపునిచ్చారు. దోమలపై దండయాత్రలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆయా పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. రాజేంద్రపాలెంలో నిర్వహించిన ర్యాలీలో ఎం ఇ ఓ బోడంనాయుడు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను అలవర్చుకోవాలన్నారు. పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరి చేరవన్నారు. దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు విధిగా దోమ తెరలను వినియోగించుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంటి పరిసరాలు, తాగునీటి బావులు, బోర్లు వద్ద నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులకు వ్యాధుల పట్ల విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ గృహాలకు పెంపు వర్తింపు చేయాలి
కొయ్యూరు, సెప్టెంబర్ 12: మధ్యలో నిలిచిపోయిన ఎన్టీ ఆర్ గృహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్న నగదును ఇందిరమ్మ గృహాలకు వర్తింపు చేయాలని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వారా నూకరాజు కోరారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇళ్ళు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కొంత మంది కట్టుకోలేక పోయారన్నారు. ఎన్టీ ఆర్ గృహాలకు ఇస్తున్న మాదిరిగానే వీటికి అదనంగా 75 వేల రూపాయలను అందించాలని డిమాండ్ చేసారు. పాడేరు నియోజకవర్గంలో వైకాపా నాయకులతో సమన్వయంగా పని చేయాలన్నారు . జగన్‌ను సీ ఎం చేయాలనే లక్ష్యంగా వర్గ విభేదాలు మాని అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆయన సూచించారు.