విశాఖ

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు చెందిన భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను బుధవారం పంపిణీ చేసారు. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపం వద్ద విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగలపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు 42 గ్రామాల గిరిజనులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందచేసారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్టు ట్రస్ట్ ప్రతినిధులు డి.శ్రీనివాస్, రవి తెలిపారు. వినాయక విగ్రహాలను పంపిణీ చేయడమే కాకుండా వాటి వినియోగాన్ని పెంపోందించి భక్తులకు అవగాహన కల్పిస్తున్నట్టు వారు చెప్పారు. మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరుతూ ప్రచారం నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు.
వ్యాధులపై కదిలిన యంత్రాంగం
అరకులోయ, సెప్టెంబర్ 12: ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాధుల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతపై అధికార యంత్రాంగం కదిలింది. మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యాధులపై అవగాహన కల్పించడం, ర్యాలీలు నిర్వహించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నివాస గృహాల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామాలలోని గిరిజనులకు సూచిస్తుండగా, పారిశుధ్యం మెరుగుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోరారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అరకులోయ పట్టణంలో బుధవారం డ్రైడే నిర్వహించారు. పట్టణంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులతో నిర్వహించి నాల్గు రోడ్ల కూడలి వద్ద మానవహారం చేపట్టారు. మండల విద్యాశాఖ అధికారి భారతిరత్నం సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పాఠశాలల అభివృద్ధి కమిటి డ్రైడే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ర్యాలీలు చేపట్టి ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పి.డి.ఒ. విజయకుమార్, గిరిజన సంక్షేమ సహాయ అధికారి ఎస్.బొంజుబాబు, పెదలబుడు పంచాయతీ కార్యదర్శి అచ్చుతరావు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, సి.ఆర్.పి.లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.