విశాఖపట్నం

ఉపాధి హామీలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 12: ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్భందీగా అమలు చేసి దేశంలోనే జిల్లా మొదటి స్థానం సాధించేలా కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పధక సంచాలకులు బి.దయానిది సూచించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సంచాలకులు, ఇతర అధికారులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సహకారంతో గత రెండు సంవత్సరాలలో ఉపాధి హామీ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని సాధించి జిల్లాకు జాతీయ అవార్డు లభించిందని చెప్పారు. లబ్ధిదారులకు ప్రయోజనాత్మకంగా ఈ పథకాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేసి గత వైభవాన్ని కొనసాగించేందుకు పాటుపడాలని ఆయన కోరారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంభానికి వంద రోజుల పనిదినాలను కల్పించి కనీసం 20 వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను అధిగమించేందుకు సిబ్బంది పర్యవేక్షణ విధానాన్ని మెరుగుపరచుకుని గిరిజనుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధి పథకం గురించి సిబ్బంది పూర్తిస్తాయి అవగాహన పెంపోందించుకుని క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులను తెలుసుకోవలసి ఉందని ఆయన అన్నారు. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా నిలవాలని ఆయన సూచించారు. మండల స్థాయిలలో నిర్వహించే సమీక్షా సమావేశాలలో ప్రాధాన్యత కలిగిన పనులను గురించి చర్చించాలని, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుని వారి సహకారం తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చునని ఆయన చెప్పారు. పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులను చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మండలం వారీగా కల్పించిన పని దినాలు, జరిగిన వ్యయం వంటి వివరాలను జియోటాగింగ్ చేయాలని, పూర్తి చేసిన పనులను సాఫ్ట్‌వేర్‌లో ముగించాలని ఆయన చెప్పారు. పంట సంజీవిని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఘన, వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు, పాఠశాలలో ఆట స్థలాల ఏర్పాటు, ఇంకుడు గుంతలు, ఉద్యానవన తోటల పెంపకం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంపకం, గ్రామాలలో పార్కుల ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రాలలో న్యూట్రీ గార్డెన్ల పెంపకం వంటి అంశాలపై ఏర్పరచిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి తదితర వాటిని దయానిధి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు, సలహాలు చేసారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం సంచాలకులు మల్లిఖార్జునరావు, లచ్చన్న, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పాడేరులో ఇంటింటా వినాయక
పాడేరు, సెప్టెంబర్ 12: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పద్మశాలి సంఘం ప్రతినిధులు ఇంటింటా వినాయక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మట్టి వినాయక ప్రతిమలను పాడేరు పట్టణంలో ఇంటింటికి విరివిగా పంపిణీ చేసి మట్టి వినాయక ప్రతిమల విశిష్టతను, ప్రాధాన్యతను గురించి వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే వినియోగించాలని వారు కోరారు. పాడేరు పట్టణంలోని అన్ని వీధులలో దాదాపు పనె్నండు వందల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు సిద్దనాటి కొండలరావు, గెడ్డం నరసింహరావు, పాపారావు, ఆర్.కె.రాజు, ఎస్.డి.రవి, ఈశ్వరరావు, మహేష్, మధు తదితరులు పాల్గొన్నారు.