విశాఖపట్నం

ఏది చారిత్రాత్మక అవసరం ‘బాబూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు చారిత్రక అవసరం అన్న చంద్రబాబు, తెలంగాణ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలయిక చారిత్రాత్మకంగా పేర్కొనడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అధినేత మహా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆరిలోవ సమావేశ వేదిక వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయల లబ్ధికోసం దేనికైనా సిద్ధపడే చంద్రబాబు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా పుట్టిన టీడీపీని కాంగ్రెస్‌తో జతకట్టేలా చేశారన్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే అది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు వేసినట్టే అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు వైసీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్టే అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ, కాంగ్రెస్‌లను తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో పోల్చిన టీడీపీ ఇప్పుడు ఎలా జతకడుతుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీకి, చంద్రబాబుకు కల్పవృక్షంగా మారిందన్నారు. స్పిల్‌వే, ఎర్త్‌వర్క్‌లో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, కాగ్ వంటి జాతీయ సంస్థలు ఎత్తిచూపుతున్నా చంద్రబాబు సర్కారు చెవికెక్కట్లేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు పేరిట టీడీపీ హంగామా చేస్తోందని దుయ్యబట్టారు. తాజాగా గ్యాలరీ వాక్ పేరిట కుటుంబంతో కలిసి విహారయాత్ర చేశారన్నారు. సమావేశంలో వైసీపీ నేతలు గుడివాడ అమర్, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.