విశాఖపట్నం

మేలు చేసిందెవరు..ఆలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: ప్రజలకు మేలు చేసిందెవరు. ప్రజల గుండెలను హత్తుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేసిందెవరు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఆరిలోవలో బుధవారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 2004లో అధికారం చేపట్టిన దివంగత నేత వైఎస్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో ప్రధాన మైనవి ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా గృహనిర్మాణ వంటి కార్యక్రమాలు ప్రస్తావించారు. ముస్లిం సోదరులకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైఎస్ పాలనకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు పొంతన లేదన్నారు. ఎవరి పాలనలో ప్రజలకు మేలు కలిగిందో గుర్తించాలన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ తన మేనిఫెస్టోలో ప్రతి కులానికీ, మతానికీ ఒకటి రెండు పేజీలు కేటాయించిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క అంశాన్ని కూడా చంద్రబాబు అమలు చేయకుండా వంచించరని మండిపడ్డారు. ఇక చంద్రబాబుకు చిత్తశుద్ధి అసలు లేనేలేదని ధ్వజమెత్తారు. వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకుని వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. నాలుగున్నరేళ్లుగా ముస్లిం వర్గానికి కేబినెట్‌లో స్థానం కల్పించలేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిచే పదవికి రాజీనామా చేయించి తాను పోటీకి నిలిపానని స్పష్టం చేశారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థినుల విషయంలో చంద్రబాబు చేసిన నయవంచన వారి భవిష్యత్‌ను నాశనం చేసిందన్నారు. దాచేపల్లి ఘటనలో చిన్నారిపై అత్యాచార ఘటనతో మహిళలపై జరుగుతున్న దాష్టీకాలకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, నవరత్నాల్లాంటి పథకాలు అమలు చేసి ప్రజల కళ్లల్లో కాంతి నింపుతామన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్ వర్తింప చేస్తామని, ముస్లిం యువతుల వివాహానికి దుల్హన్ పథకం రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అంజాద్ భాషా మాట్లాడుతూ విశ్వసనీయతకు వైఎస్ కుటుంబం నిదర్శనమన్నారు. జగన్ సొంత జిల్లా కడపలో ముస్లిం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి, తన మేనమామను కమలాపురం నుంచి పోటీకి నిలిపారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే అనంతపురం జిల్లా హిందుపురంలో తన బావమరిది బాలకృష్ణకు అవకాశం కల్పించారన్నారు. వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు రెహ్మాన్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా బీజేపీతో చెలిమి చేసిన చంద్రబాబు ఎన్నికల ముందు తెగతెంపులు చేసుకుని నారా హమారా, టీడీపీ హమారా అంటూ ముస్లిం సోదరులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. విశ్రాంత పోలీసు అధికారి ఇక్బాల్ మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకూ ఎన్నిసార్లు బీజేపీతో చెలిమిచేసి, ఎన్నిసార్లు విడిపోయారని ప్రశ్నించారు. అధికారం కోసం అపవిత్ర పొత్తులు చంద్రబాబుకు కొత్త కాదన్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు, మహిళలు, యువత తమ సమస్యలు జగన్‌కు వివరించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.