విశాఖపట్నం

హాట్ హాట్‌గా రైల్వే జోనల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం జరిగిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోనల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ హరిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, అశోకగజపతిరాజు, రామ్మోహననాయుడు రైల్వే జోన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ప్రజల ఆవేదనను ఉన్నతాధికారులకు తెలియచేయాలని జీఎం ఉమేష్ సింగ్‌కు సూచించారు.
ఎంపీ హరిబాబు మాట్లాడుతూ రైల్వే ప్రోజెక్ట్‌ల ప్రగతి చాలా బాగుందని అన్నారు. విశాఖపట్నం-వారణాసి రైలును వెంటనే పట్టాలు ఎక్కించాలని సూచించారు. విశాఖ-అరకు రైలుకు అదనపు విస్డాడోమ్ కోచ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎసీ ఎక్స్‌ప్రెస్, కిరండల్-విశాఖపట్నం ప్యాసింజర్ రైలు వెళలను సవరించాలని సూచించారు. దీనిపై రైల్వే జీఎం ఉమేష్ సింగ్ బదులిస్తూ, దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీ అశోకగజపతిరాజు మాట్లాడుతూ విజయనగరం జిల్లా పరిధిలో రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని, విజయనగరం రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ సౌకర్య కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో అదనంగా మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. గోదావరి, గరీబ్థ్,్ర తిరుమల, విశాఖపట్నం-ఎల్‌టీడీ ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం వరకూ పొడింగించాలని విజ్ఞప్తి చేశారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపించి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గరీబ్థ్,్ర ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడ రైల్వే స్టేషన్‌లో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో వీవీఐపీల కోసం కూపేల సంఖ్యను పెంచాలని సూచించారు. గరీబ్థ్,్ర సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను కుర్దా రోడ్డు వరకూ పొడిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బ్యాటరీ కారు, ఏటీఎం సౌకర్యం, రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని అవంతి కోరారు. విశాఖ ఎక్స్‌ప్రెస్, హౌరా-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లను పెందుర్తి రైల్వే స్టేషన్‌లో హాల్ట్ చేయాలని సూచించారు. పెందుర్తి, దువ్వాడ రైల్వే స్టేషన్లను స్మార్ట్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. పాతపట్నం, టెక్కలి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారంల ఎత్తు పెంచాలని సూచించారు. విశాఖపట్నం-గుణుపూరు పాసింజర్ రైలుకు దండుగోపాలపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. బస్తర్ ఎంపీ దినేష్ కాశ్యప్ మాట్లాడుతూ జగ్దల్‌పూర్, ఢిల్లీలను కలుపుతూ ఓ కొత్త రైలును ఏర్పాటు చేయాలని సూచించారు. జగ్దల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఏసీ విశ్రాంతి గదిని ఏర్పాటు చేయాలని కోరారు. అమగుర, టోకోపాల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారంల ఎత్తు పెంచాలని సూచించారు. దుర్గ్ ఎక్స్‌ప్రెస్ వేళలలను ప్రయాణికుల డిమాండ్ మేరకు సవరించాలని కోరారు. అలాగే బోగీల్లో శుభ్రత కొరవడిందని, దానిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కాశ్యప్ కోరారు. దీనిపై జనరల్ మేనేజర్ స్పందిస్తూ, రైల్వే స్టేషన్ల స్థాయినిబట్టి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆయా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయని చెప్పారు. కోరాపుట్ ఎంపీ జినా హిక్కా మాట్లాడుతూ కోరాపుట్, జగ్దల్‌పూర్ నుంచి భువనేశ్వర్‌కు అదనపు రైళ్లను నడపాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని రైల్వే జీఎం హామీ ఇచ్చారు. ఒడిశా రాజ్యసభ సభ్యుడు నెక్కంటి భాస్కర్ మాట్లాడుతూ రైళ్లు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ మాట్లాడుతూ కొత్తవలస-కిరండల్ మార్గంలో దెబ్బతిన్న 249 బ్రిడ్జిని రికార్డు సమయంలో పునరుద్ధరించడం పట్ల సిబ్బందికి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం మాథూర్ తదితరులు పాల్గొన్నారు.