విశాఖపట్నం

సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పారిశుద్ద్యపై నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 21: ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు పడుతున్న కారణంగా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి వాధ్యుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు వహించి అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సూచించారు. పట్టణంలో 33, 34, 5వ వార్డులైన ఏఎంసి కోలనీ, విజయకామరాజుపేట, న్యూ బర్మాకోలనీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం జివిఎంసి జోనల్ కమీషనర్, వివిధ శాఖల అధికారులుతో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సిసిరోడ్లు, డ్రైనేజి కాలువలు పరిశిలించి ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. వీధుల్లో, డ్రైనేజి కాలువల్లో చెత్తా పేరుకుపోయి ఉండడాన్ని గమనించి ఎమ్మెల్యే ఆసహనం వ్యక్తం చేసారు. వార్డుల్లో పారిశుద్ధ్యంపై ప్రతీరోజూ సమీక్ష నిర్వహించి ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్సి బి రాముకు సూచించారు. సీజనల్ వ్యాధులుపట్ట ప్రజలకు ఆవగాహన కల్పించి వ్యాధులు తలెత్తకుండాప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. అమృత పథకం పైపులైన్లు వేగవంతం చేయాలని పైపులైను అవసరం అయినవారికి ధరఖాస్తులు చేసుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు.లెప్రసీ కోలనీ వాసులు తమకు ప్రభుత్వం నుండి మందులు అందడం లేదని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారితో మాట్లాడి మందులు అందే విధంగా చర్యలు చేపడతామన్నారు. విజయరామరాజుపేట మరిడిమాంబ గుడి సమీపంలో నిర్మించిన సిసిరోడ్డు నాణ్యతాలోపం ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు.ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇంటి పరిశరాలు శుభ్రంగా ఉంచుకొని దోమలు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని ఆయన సూచించారు. ఆయన వెంట దేశం నాయుకులు మళ్ళ సురేంద్ర, కొణతాల వెంకట్రావు, బిఎస్‌ఎంకె జోగినాయుడు, కొణతాల రత్నకుమారి, బొలిశెట్టి శ్రీనివాసరావు, పలకా సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.