విశాఖపట్నం

వాడవాడలా భారీ అన్నసమారాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 21: వినాయక నవరాత్రుల మహోత్సవంలో భాగంగా శుక్రవారం పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో భారీ అన్నసమారాదనలు నిర్వహించారు. స్థానిక గాందీనగరం అంజయ్య కోలనీలో బాలగణపతి యూత్ అధ్వర్యంలో అన్నసమారాదన నిర్వహించారు. వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, వైకాపా నాయుకులు కొణతాల మొరళీ కృష్ణ, పట్టణ విభాగ అధ్యక్షులు జాజుల రమేష్‌లు ముఖ్య అతిధులుగా విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధనను జానీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో వినాయక నవరాత్రులకు అర్బాటాలకు పోయి డబ్బును వృధాగా కర్చుచేసేవారని ప్రస్తుత యువత వాటికి స్వస్తిపలికి అన్నదానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వడం అభినందించారు. గణనాధున్ని ప్రతిష్టించిన ప్రతీ చోటా శుక్రవారం నిర్వాహులు అన్నసమారాదన నిర్వహించారు. గవరపాలెం, వెల్పులవీధి, శారదాకోలనీ, నర్సింగరావుపేట, కొత్తూరు, శారదానగర్, తుమ్మపాల తదితర ప్రాంతాల్లో అన్నసమారాదన నిర్వహించారు. తొమ్మిదోవ రోజైన శనివారం గణనాధులను నిమజ్జనం చేయడానికి నిర్వాహుకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్షేమ భవనం నిధుల మంజూరుకు కృషి
చోడవరం, సెప్టెంబర్ 21: దివ్యాంగుల సంక్షేమ భవనం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగులకు వికలత్వ దృవీకరణ పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎంతమంది మిగిలి ఉన్నా వారందరికీ దృవపత్రాల ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. అవసరమయితే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మరో మారు సదరన్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేసారు. ఈ క్యాంప్‌లకు డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.