విశాఖ

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 26: పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరికి భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇంతవరకు ఇద్దరు గన్‌మెన్‌లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం నలుగురు గన్‌మెన్‌లను కేటాయించడమే కాకుండా పాడేరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన సంఘటనతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమే పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి భద్రత పెంపుకు కీలక నిర్ణయాలు చేపట్టారు. దీంతో ఇకనుంచి నలుగురు గన్‌మెన్‌లు నిరంతరం ఎమ్మెల్యే వెంట ఉంటూ ఆమె భద్రతను సమీక్షించనున్నారు. ఎమ్మెల్యే పర్యటనల సమయంలో నలుగురు గన్‌మెన్‌లు ఆమె వెంట ఉండేవిధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వీరికి అధునాతనమైన ఎ.కె.47 తుపాకులను సమకూర్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి నుంచి ఆరుగురు సి.ఆర్.పి.ఎఫ్. కానిస్టేబుళ్లను నియమించారు. క్యాంపు కార్యాలయం వద్ద వీరు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కార్యాలయానికి వచ్చే వారిని నిశితంగా తనిఖీ చేస్తూ ఆమె వద్దకు పంపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పుడు ఆరుగురు సి.ఆర్.పి.ఎఫ్. కానిస్టేబుళ్లతో పాటు నలుగురు గన్‌మెన్‌లు కూడా భధ్రత విధులను నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిని వీరు ముందుగా వాకబు చేసి ఏ పని మీద ఎందుకు వచ్చింది వంటి వివరాలను సేకరించిన తరువాత మాత్రమే లోపలకు అనుమతించే విధంగా పోలీసు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎమ్మెల్యే వద్దకు పంపాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో మంగళవారం నుంచి భద్రత అమలులోకి రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సందర్శకులకు ఇబ్బంది తప్పడం లేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇంతవరకు ఎటువంటి నియమం, నిబంధన లేకపోవడమే కాకుండా వచ్చిన వారు ఎవరైనా నిర్భయంగా లోపలకు వెళ్లే పరిస్థితి ఉండేది. ఈ విధానం ఎమ్మెల్యే భద్రతకు ముప్పు తెచ్చే విధంగా ఉండడంతో పోలీసు ఉన్నత అధికారులు దీనిని గమనించి ఈ విధానాన్ని కట్టడి చేసినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం ఉండడమే కాకుండా అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును చాకచక్యంగా మట్టుబెట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరికి భద్రతను కట్టుదిట్టం చేసారు. దీంతో ఎమ్మెల్యేను కలవాలంటే ఇకనుంచి భద్రత సిబ్బంది అనుమతి ఉండాల్సిందేనని అంటున్నారు.