విశాఖ

తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాల్సింది.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 25: తమ తండ్రి ఏదైనా తప్పు చేసి ఉంటే ముందుగా హెచ్చరికలు జారీ చేసి తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని మావోయిస్టులు ఇచ్చి ఉండాల్సిందని, ఇదేమి లేకుండా ఆకస్మికంగా అన్యాయంగా చంపేసారని మావోల చేతిలో హత్యకు గురైన ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు తనయులు శ్రావణికుమార్ (నాని), సందీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. కిడారి ఇద్దరు కుమారులు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ తమ తండ్రి ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని, అటువంటప్పుడు మావోలు ఎందుకు పొట్టన పెట్టుకున్నారో తెలియదని అన్నారు. మావోయిస్టుల చర్యను తాము ఎన్నడూ ఊహించలేదని, గతంలో మావోల నుంచి ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో ఇలా జరుగుతుందని అనుకోలేదని వారు వారు వాపోయారు. తమ తండ్రిని మావోయిస్టులు హత్య చేసారన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్టు వారు చెప్పారు. మావోలు చేసిన ఈ దుశ్చర్య వలన తమ కుటుంభం రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. తన వద్దకు వచ్చే ప్రతి వారికి సహాయం చేసే గుణం తమ తండ్రిలో ఎప్పుడూ ఉండేదని, గిరిజనాభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుండేవారని వారు అన్నారు. గిరిజనుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిచ్చేవారని, ప్రజా సేవలో పడి తమతో కూడా ఎక్కువ సమయం గడిపేవారు కాదని వారు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత గిరిజనుల అభివృద్ధికి, వారి సంక్షేమానికి తమ తండ్రి చేసిన కార్యక్రమాలే ఎక్కువని, గిరిజనులకు మంచినీటి సౌకర్యం, గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణం, గృహాల మంజూరు వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని వారు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులలో తమ తండ్రిని మావోయిస్టులు ఎందుకు హతమార్చాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు. అయితే మారుమూల గ్రామాలకు ఎందుకు వెళుతున్నారని తాను ఒకసారి అడిగానని, మనం చెడ్డపని ఏదీ చేయడం లేదుకదా, అటువంటప్పుడు ఎవరు ఏం చేస్తారని అన్నారని కిడారి మొదటి కుమారుడు నాని చెప్పారు. తనతోనే ఎక్కువ సమయం మాట్లాడేవారని, మాట్లాడినప్పుడల్లా చదువు కోసం చెప్పేవారే తప్ప రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదని ఆయన అన్నారు. అయితే తనను బాగా చదువుకోమని చెప్పేవారని, రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉందని అనేవారని ఆయన చెప్పారు. తన తమ్ముడు సందీప్‌ను మాత్రం ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకునే వారని ఆయన అన్నారు. తమ ఇద్దరిని ఎప్పుడూ చిన్న పిల్లలుగానే చూసేవారని ఆయన చెప్పారు. డిల్లోలో ఉన్న తనతో ఈ నెల 21వ తేది శుక్రవారం చివరిసారిగా మాట్లాడారని, వెన్ను నొప్పిగా ఉంది, డాక్టరుకు చూపించుకునేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నానని చెప్పారని నాని వివరించారు.
అంతా సీఎం దయ
తమ భవిష్యత్తు అంతా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఆధారపడి ఉందని కిడారి తనయులు శ్రావణికుమార్ (నాని), సందీప్‌కుమార్ చెప్పారు. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తమ కలలకు అర్థాంతరంగా బ్రేకు పడిందని వారు వాపోయారు. తమ తండ్రిని మావోయిస్టులు హతమార్చి ఉండకపోతే తమ భవిష్యత్ అంతా నందనవనంగా ఉండేదని, అనుకోని రీతిలో సంబవించిన విపత్కర పరిణామంతో ఎంతో ఆందోళన చెందుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఐ.సి.ఐ.సి. బ్యాంకులో వెల్త్ మేనేజ్‌మెంట్ బిజినెస్ ట్రైనీగా పనిచేస్తున్న తాను ఉన్నత చదువుల కోసం గత సంవత్సరమే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు కిడారి రెండో కుమారుడు సందీప్‌కుమార్ చెప్పారు. అయితే తన తండ్రి లేకపోవడంతో ఏలా చదువుకోవాలని ఆందోళన చెందుతున్నట్టు ఆయన వాపోయారు. ఈ పరిస్థితిలో తమను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుని తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి తమకు పెద్దదిక్కుగా ఉంటారనే నమ్మకంతో కొంతవరకు ఉపసమనం పొందుతున్నట్టు వారు చెప్పారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలిఫోన్‌లో మాట్లాడారని, అండగా ఉంటామని చెప్పారని వారు పేర్కొన్నారు. తమ కుటుంభ సభ్యుల అందరితో చర్చించి తమకు ప్రభుత్వపరంగా ఏం కావాలన్నది నిర్ణయించుకోనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా వారు చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తమ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోనున్నట్టు శ్రావణికుమార్, సందీప్‌కుమార్ స్పష్టం చేసారు.