విశాఖ

వైభవంగా ఉపమాకవెంకన్న వార్షిక బ్రహ్మత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, అక్టోబర్ 14: టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడి ఉపమాక గరుడాద్రి పర్వతంపై వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వరోజు ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని హంసవాహనంపై మాఢవీధుల్లో అంగరంగ వైభవంగా తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మహిమాన్వితుడు ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు జీవీ ప్రసాదాచార్యులు సహా అర్చక బృందం ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిత్య కార్యక్రమాలు నిర్వహించి గ్రామ బలిహరణలు, విశేష ప్రసాద నివేదనలు, ప్రత్యేక హోమాలు పూర్తిచేసారు. ఆ తరువాత సుదర్శన పెరుమాళ్‌తో గ్రామ బలిహరణలు జరిపించారు. ఈకార్యక్రమంలో భాగంగానే శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ స్వామివారిని హంస వాహనంపై వేంచేయింపజేసి ఆలయ మాఢవీధుల్లో ఘనంగా తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తజనకోటి తరలివచ్చి శ్రీ స్వామివారి తిరువీధి సేవకు ఎదురేగి దర్శించి తరించారు. అలాగే సాయంత్రం ఎప్పటి మాదిరిగానే ఆలయంలో నిత్య కార్యక్రమాలు నిర్వహించిన తరువాత సుదర్శన పెరుమాళ్‌తో గ్రామ బలిహరణలు జరిపించారు. ఆ తరువాత లక్ష్మీదేవి, పద్మావతీ సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారిని సప్పరం వాహనంలో వేంచేయింపజేసి స్వామివారి తిరువీధి సేవ నాళాయర సేవాకాలంతో వైభవోపేతంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు జీవీ ప్రసాదాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఎస్. కృష్ణమాచార్యులు, బీసపాటి వెంకట శేషాచార్యులు, ఎల్లింద వెంకట గోపాలాచార్యులు, ఎం. రంగాచార్యులు, విసిహెచ్ గోపాలాచార్యులు, టీటీడీ ఇనస్పెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది టివిపి రాజశేఖర్, గిరికుమార్ పలువురు భక్తులు పాల్గొన్నారు.