విశాఖ

అశ్రు నయనాలతో కిడారి సంతాప సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, అక్టోబర్ 14: దివంగత స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సంతాప సభను అరకులోయలో ఆదివారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ సంతాప సభకు విచ్చేసిన బందువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు, వివిధ ప్రాంతాల ప్రజానీకం ఆయన చేసిన సేవలను నెమరవేసుకోగా, సభలో పాల్గొన్న అనేక మంది మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించడం కనిపించింది. ఈ సభకు విచ్చేసిన వారంతా కిడారి, సోమల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడామైదానంలో నిర్వహించిన కిడారి సంతాప సభకు జనం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అశేషంగా తరలివచ్చిన జనంతో ఈ ప్రాంతం కిక్కిరిసలాడింది. పాడేరు నుంచి అరకులోయ వరకు దాదాపు వంద వాహనాలతో నాయకులు, అభిమానులు, బంధువులు తదితరులంతా వాహన కాన్వాయి నిర్వహించి రావడం పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. సంతాప సభకు విచ్చేసిన జనంతో అరకులోయ కిటకిటలాడి నూతన శోభను సంతరించుకుంది. కాగా సంతాప సభకు విచ్చేసిన వారంతా రెండు నిమిషాల పాటు వౌనం పాటించి కిడారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కిడారి సంతాప సభను పురస్కరించుకుని పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేసారు.

తన భూమిని కాజేసేందుకు ఎమ్మెల్యే యత్నం
పాడేరు, అక్టోబర్ 14: వారసత్వంగా సంక్రమించిన తన భూమిని కాజేసేందుకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయత్నిస్తున్నారని గిరిజన ఉపాధ్యాయుడు జంపరంగి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక పి.ఎం.ఆర్.సి. రోడ్డు పక్కన సర్వే నెంబరు 7.5లో ఉన్న స్థలం గత 20 సంవత్సరాలుగా తన ఆధీనంలో ఉన్నట్టు చెప్పారు. అయితే ఎమ్మెల్యే ఈశ్వరి తప్పుడు దృవీకరణ పత్రాలను సృష్టించి తన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన స్థలంలో ఉన్న షెడ్ రేకులు ఇటీవల తుపానుకు ఎగిరిపోవడంతో తాను రేకులు వేయిస్తుండగా పోలీసులను పంపించి తనను రోజంతా అక్రమంగా నిర్భంధించారని ఆయన వాపోయారు. అధికార బలాన్ని వినియోగించి తనపై తప్పుడు కేసు నమోదు చేయించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. తన భూమిలో తనను ఉండనీయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎమ్మెల్యేకు తగదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఈశ్వరి చర్యలపై ముఖ్యమంత్రికి, ఎస్.టి., ఎస్.సి. కమిషన్‌కు పిర్యాదు చేస్తున్నట్టు ప్రసాద్ తెలిపారు.

ముమ్మరం ఓటర్లనమోదు
నర్సీపట్నం, అక్టోబర్ 14: ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ఆదివారం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో యువతీయువకులు తరలివచ్చి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి పలువురు దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో ఓటర్ల నమోదు కేంద్రాలను తహశీల్దార్ వీవీ రమణ, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ జె.సూర్యనారాయణలు పర్యవేక్షించారు. మండలంలోని పెదబొడ్డేపల్లి , గురందొరపాలెం గ్రామాల్లో వీరు ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీంచారు. ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ కల్పించిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో యువతీయువకులు పాల్గొని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వీ ఆర్ ఓలు , బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు .

యువమోర్చా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
నర్సీపట్నం, అక్టోబర్ 14: అటల్ యువ మహా అధిరిషన్ సమ్మేళనం ఈనెల 27,28 తేదీల్లో సికింద్రాబాద్ ఫెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నట్లు బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు నగిశెట్టి గంగబాబు తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 40 వేల మంది యువమోర్చా కార్యకర్తలు హాజరవుతారన్నారు. ఈకార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,కేంద్ర మంత్రులు , పార్లమెంట్ సభ్యులు హాజరవుతారన్నారు. 28వ తేదీ సాయంత్రం లక్ష మందికి పైగా యువమోర్చా కార్యకర్తలతో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. ఈర్యాలీకి విశాఖ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువమోర్చా కార్యకర్తలు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.