విశాఖ

బీజేపీ అభివృద్ధిని హైజాక్ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం రాష్ట్భ్రావృద్దికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ దానిని హైజాక్ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం నిర్వహించుకుంటుందని గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆరోపించారు. మంగళవారం గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వీటిని తమ ప్రభుత్వం చేస్తున్న గొప్పదనంగా ప్రచారం దేశం పార్టీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను పీ ఎం మోదీ అమలు చేస్తారన్నారు. గూడెంలో వెలుగు కార్యాలయంలో హాజరైన డ్వాక్రా మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ కొణతాల అప్పలరాజు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కురచ రాజారావు, జిల్లా కార్యదర్శి చెల్లా రామకృష్ణ, స్థానిక బీజేపీ నాయకులు త్రినాధ్,నాగేష్, ఆర్.పాలు తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకు గ్రామీణ బ్యాంకు ఖాతాలు
గూడెంకొత్తవీధి, నవంబర్ 13: గూడెంకొత్తవీది మండలంలో ఉన్న డ్వాక్రా మహిళలకు గ్రామీణ బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసారు. ప్రభుత్వ పథకాల్లో బ్యాంకు ఖాతాలు అవసరమైన నేపధ్యంలో వెలుగు సిబ్బంది ఈకార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. చాలా మందికి ఖాతాలు లేక లోన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈనేపధ్యంలో వెలుగు సిబ్బంది గ్రామీణ బ్యాంకు మేనేజర్ గూడెం కొత్తవీదికి తీసుకువచ్చి మహిళలకు ఖాతాలు ఓపెన్ చేసారు.
ఉత్సాహంగా బాలికల ఆటల పోటీలు
రావికమతం,నవంబర్ 13: మండలంలో టి. అర్జాపురం హైస్కూల్‌లో మంగళవారం ఎపీ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు బాలికల ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈపోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్నాదీశ్వరరావు ప్రారంభించారు. మండలంలో 8 హైస్కూల్స్, ఒక కేజీబీవీ నుంచి 120 మంది బాలికలు ఈపోటీల్లో పాల్గొన్నారు. కబాడీ, ఖోఖో, వాలీబాల్ ఆటల పోటీలను ఎనిమిది హైస్కూల్స్‌కు చెందిన పీ ఇటీలు, పీడీలు పర్యవేక్షణలో జరిగాయి. అనంతరం విజేతలకు ఎపీ మహిళా సమితి వారు బహుమతులు అందజేసారు. ఈకార్యక్రమంలో మహిళా సమితి సభ్యులు నాగమణి, గౌరీ, భవానీలు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం
కోటవురట్ల, నవంబర్ 13: దివ్యాంగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తమ సంస్థ పని చేస్తున్నట్లు జాతీయ బుద్ధిమాంజీల సాధికార సంస్థ ప్రాంతీయ కో ఆర్డినేటర్, పునరావాస అధికారి డాక్టర్ ఎ. ఈశ్వరరావు తెలిపారు. సర్వశిక్షా అభియాన్, సాధికార సంస్థ సంయుక్తంగా స్థానిక భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు మంగళవారం ఒక్కరోజు శిక్షణా కార్యకమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎడీవో కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక అవసరాల పిల్లల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. తల్లిదండ్రులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎం ఇ ఓ దాస్ తదితరులు పాల్గొన్నారు.