విశాఖ

గ్రామాలలో పొలం పిలుస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 13: మండలంలో శంకరం, సాగరం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఆర్.రమేష్‌బాబు పంట పోలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేసారు. అనంతరం రైతులతో సమావేశమై ఖరీఫ్ పంట కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఖరీఫ్ సీజన్‌లోని పంటలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని, నవంబర్ నెలలో వరి పంటపై దోమపోటు సంబవిస్తుందని ఆయన చెప్పారు. దీని నివారణకు అవసరమైన మందులు చల్లుకోవాలని ఆయన అన్నారు. పంట కోతకు వచ్చే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పోలాల్లో మురుగు నీరు నిల్వకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్ మెటార్లు, నూర్పుడి యంత్రాలు వంటి వాటిని అందించనున్నట్టు ఆయన తెలిపారు.

పారిశుధ్య నివారణకు సంపద కేంద్రాల ఉపయోగం
మాడుగుల, నవంబర్ 13: గ్రామాలలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చెత్త సంపద కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని మండల పంచాయతీ విస్తరణ అధికారి కె.అప్పారావు అన్నారు. మండలంలోని ముకుందపురం గ్రామంలో నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని సేకరించి వాటి నుంచి సంపద తయారీ చేసేందుకు నిర్మించిన ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు సేకరించే చెత్తను ఇందులో నిల్వ చేయాలని చెప్పారు. చెత్త నుంచి పంచాయతీకి ఆదాయం కూడా సమకూరనున్నట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి.నాగేశ్వరరావు, సంపద తయారీ కేంద్రాల రిసోర్స్ పర్సన్ జయలక్ష్మి, మాజీ సర్పంచ్ బి.వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ టీడీపీ నేత కొండలరావు మృతి
గూడెంకొత్తవీధి, నవంబర్ 13: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం ఎర్ర చెరువులు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పలాసకొండలరావు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ నాయకుడిగా, మండల పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా తన వంతు కృషి చేసారు. ఇతనికి ముగ్గురు పిల్లలు . కొండలరావు మృతిపట్ల టీడీపీ నాయకులు , గిరిజనులు సంతాపాన్ని తెలిపారు.