విశాఖ

అభివృద్ధితో వలస వస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 13: గిరిజన ప్రాంతంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారంతా దేశం పార్టీలో చేరుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. మండలంలోని గొండెలి పంచాయతీ వంచెడిగొంది గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ దర్శిని కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు దేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. గిరిజన గ్రామాలకు తారు రోడ్ల నిర్మాణాలను చేపడుతూ గిరిజనులకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామని, అనేక గ్రామాలలో ఇప్పటికే నీటి పథకాల నిర్మాణాలను చేపట్టామని ఆమె చెప్పారు. గిరిజనులకు అవసరమైన అన్ని రకాల వౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక ఆసరా అందిస్తున్నామని, గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీల వారిని ఆకర్షిస్తున్నాయని ఈశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు బొర్రా విజయరాణి, పోలుపర్తి గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
చురుకుగా సభ్యత్వ నమోదు
అరకులోయ, నవంబర్ 13: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. ఈ సంవత్సరం లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేసేందుకు దేశం నాయకులు, కార్యకర్తలు తమ వంతు కృషి చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ సూచనల మేరకు నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ అన్ని గ్రామాలలో పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శెట్టి అప్పాలు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పొద్దు అమ్మన్న, శెట్టి బాబురావు, సాయిరాం సభ్యత్వ నమోదుకు కృషి చేస్తున్నారు. మండలంలోని పద్మాపురం, యండపల్లివలస గ్రామాలలో మంగళవారం ఒకే రోజు నాలుగు వందల సభ్యత్వాలను నమోదు చేయించి రికార్డు సృష్టించారు. ఇదే తరహాలో ప్రతి రోజు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వాల నమోదును చేపడతామని నాయకులు ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిడారి శ్రావణ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయించాల్సిన అవసరం ఉందని గుర్తించిన నాయకులు ఇందుకు తమవంతు పాటుపడుతున్నారు. తటస్థ నాయకులను ఉత్సాహపరచడంతో పాటు సభ్యత్వ నమోదులో పాల్గొనాల్సిందిగా అప్పాలు కోరారు.
ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులను నియమించాలి
అరకులోయ, నవంబర్ 13: స్థానిక వైద్య విదాన పరిషత్ ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులను నియమించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ బి.ప్రసాద్ కోరారు. స్థానిక ఆసుపత్రి భవనంలో నిబంధనల ప్రకారం మంగళవారం ఆసుపత్రి అభివృద్ది కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన మేరకు పూర్తి స్థాయి వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయి నుంచి 150 పడకల స్థాయి వరకు పెంచిన ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బందిని నియమించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని,ఆసుపత్రి ప్రధాన ద్వారం నుంచి ప్రాంగణంలో సి.సి.రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని, రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రికి మరో అంబులెన్స్‌ను మంజూరు చేయాలని ప్రసాద్ కోరారు. ఈ సమావేశంలో వైద్యులు మహేష్, వెంకటరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు శెట్టి అప్పాలు, పొద్దు అమ్మన్న, సత్యానందం, బి.బి.లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.