విశాఖ

రోడ్ల నిర్మాణాలలో నాణ్యత పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 13: రహదారుల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి అధికారులను ఆదేశించారు. జి.మాడుగుల మండలంలోని వలసమామిడి నుంచి వైఎంపల్లి గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో, లువ్వాసింగి నుంచి తగ్గిమెట్ట వరకు కోటి 35 లక్షలతో నిర్మిస్తున్న రహదారి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనులలో నాణ్యత లోపించడాన్ని గమనించిన ఆయన కంట్రాక్టర్లపై ఆగ్రహాం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రహదారులు పది కాలాల పాటు పదిలంగా ఉండేటట్టు నిర్మించాలని సూచించారు. నాణ్యత లేని రోడ్ల నిర్మాణం వలన అనతికాలానికే మరమ్మతులకు గురై గిరిజనులకు ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లను ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. మండలంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణాలను వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఎర్రగుప్ప గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడాన్ని గమనించిన ఆయన నిర్మాణాలలో జరుగుతున్న జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. ఈ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయకపోతే సంబంధిత కంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎర్రగుప్ప గ్రామంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని స్వాదీనం చేసుకుని అంగన్‌వాడీ సేవలు ప్రారంభించాలని ఐ.సి.డి.ఎస్. అధికారులను ఆయన ఆదేశించారు. తమ గ్రామంలో విద్యుత్, తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని లువ్వాసింగి గ్రామ గిరిజనులు ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం జి.మాడుగుల తాహశీల్ధార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నుర్మతి నుంచి పినగరువు గ్రామానికి రహదారి నిర్మించేందుకు ఏర్పడిన భూ వివాదాన్ని పరిష్కరించాలని తాహశీల్ధార్‌ను బాలాజి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమం, రెవిన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.