విశాఖ

మంత్రివర్గ విస్తరణపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 13: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విశాఖ మన్యంలోని తెలుగు తమ్ముళ్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ ప్రాంతానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడమే వీరి అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గిరిజన ప్రాంతానికి చెందిన చాలామంది నాయకులు వ్యతిరేకిస్తూ లోలోపలే అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే తమ అభిప్రాయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట చెప్పే సాహసం చేయలేక ఎవరికి వారే వౌనం దాల్చాల్సిన పరిస్థితి ఈ ప్రాంత తెలుగు తమ్ముళ్లకు ఏర్పడింది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్న తీరును నాయకగణం తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయం అంటేనే ఏమిటో తెలియని శ్రావణ్‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా రెండు ప్రధాన శాఖలను అప్పగించడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న నాయకులు ఎంతో మంది ఉండగా తమందరినీ కాదని కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని శ్రావణ్‌కుమార్‌ను మంత్రిగా ఏలా నియమిస్తారని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రిని మావోయిస్టులు హత్య చేసారన్న సానుభూతితో తనయుడిని మంత్రివర్గంలో నియమించి గిరిజన ప్రాంతంలో పార్టీని పటిష్టపరచుకోవాలని ముఖ్యమంత్రి భావించడం ఏమాత్రం సరికాదని వారు అంటున్నారు. మంత్రివర్గంలోకి శ్రావణ్‌కుమార్‌ను తీసుకోవడం ద్వారా మన్యంలో పార్టీ ఏలా బలోపేతవౌతుందని, దీనివలన గిరిజన ప్రజానీకంలో పార్టీ ప్రభావం ఎందుకు పెరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా నియమితులైన శ్రావణ్‌కుమార్‌కు ఆయన అనుచరులకు మాత్రమే దీనివలన లబ్ధి చేకూరుతుందే తప్ప గిరిజనులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. దశబ్ధాల కాలంగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తూ ప్రజాధరణ కలిగిన నాయకులకు మంత్రి పదవి ఇవ్వడం వలన పార్టీ పటిష్టతకు దోహదపడుతుందే తప్ప రాజకీయం తెలియని, ప్రజలకు పరిచయం లేని శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం వలన అదనంగా కలిసొచ్చే ప్రయోజనం ఏదీ లేదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇంతకాలం పార్టీ కోసం అంతోకొంతో పనిచేస్తున్న వారంతా నిస్తేజులుగా మారాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఇంతవరకు పార్టీకి ఏమాత్రం సంబంధం లేని, నిన్న మొన్నటి వరకు తమలో చాలామందికే తెలియని శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వలన సుదీర్ఖకాలం పాటు పార్టీకి సేవలు అందించిన తామంతా ఏమైపోవాలని తెలుగుతమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఇదిలాఉండగా మంత్రిగా శ్రావణ్‌కుమార్ నియమితులు కానున్నట్టు తెలుసుకున్న దేశం నాయకులలో కొంతమంది మంత్రివర్గ విస్తరణకు ముందే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి తమ ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని, దీనివలన భవిష్యత్తులో తాము ప్రశాంతంగా పనిచేయలేమని తెలుగు తమ్ముళ్లు గంటా సమక్షంలో తమ గోడు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మన్యానికి చెందిన దేశం నాయకులు ఆవేదనను విన్న మంత్రి గంటా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఏలా కాదనగలమని ప్రశ్నించినట్టు తెలిసింది. మంత్రిగా శ్రావణ్‌ను తీసుకోవడంలో మంచి చెడులను పక్కన పెడితే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి మాట్లాడడం మంచిదికాదని చెప్పినట్టు సమాచారం. దీంతో తెలుగుతమ్ముళ్లు చేసేదేమి లేక వౌనం దాల్చినప్పటికీ ఈ ప్రాంత నాయకులలో చాలామందికి శ్రావణ్‌కుమార్‌ను మంత్రిగా నియమించడం ఏమాత్రం రుచించడం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మన్యం రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత రసవత్తరంగా మారే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు.

హెల్త్ వలంటీర్ల దీక్ష విరమణ
పాడేరు, నవంబర్ 13: తమకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా స్థానిక ఐ.టి.డి.ఎ. ఎదుట రిలే నిరాహర దీక్ష చేస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లో పనిచేస్తున్న హెల్త్ వలంటీర్లు మంగళవారం తమ దీక్షలను విరమించారు. బకాయి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇచ్చిన హామీతో వీరంతా దీక్షలను విరమించారు. హెల్త్ వలంటీర్ల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ఈశ్వరి సందర్శించి వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ్రమాల్లో పనిచేస్తున్న హెల్త్ వలంటీర్ల సమస్యను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. బకాయి ఉన్న వేతనాలు చెల్లించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారని ఆమె అన్నారు. బకాయి వేతనాలు త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుండడంతో దీక్షను విరమించాలని ఆమె సూచించారు. దీంతో ఆందోళనకారులు దీక్ష విరమించేందుకు ముందుకు రాగా ఎమ్మెల్యే ఈశ్వరి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేసారు. ఈ కార్యక్రమంలో పలువురు దేశం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిపై తాహశీల్ధార్ ప్రత్యేక దృష్టి
మాడుగుల, నవంబర్ 13: మాడుగుల ప్రాంత అభివృద్ధికి స్థానిక తాహశీల్ధార్ లోకవరపు రామారావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తికావడంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించగా మాడుగుల మేజర్ పంచాయతీకి తాహాశీల్ధార్‌ను ప్రత్యేక అధికారి బాధ్యతలను అప్పగించారు. పంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమితులైన రామారావు పంచాయతీ అభివృద్ధిపై దృష్టి సారించి ఎంతో కాలంగా అపరిష్క్రతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. దాదాపు ఇరవై వేల జనాభా కలిగిన మాడుగులలో పారిశుధ్య సమస్య నిత్యం స్థానికులను పట్టిపీడించేది. అయితే పంచాయతీ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన తాహశీల్ధార్ అనతికాలంలో పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపగలిగారు. జవ్వాదిగెడ్డ జంక్షన్‌లో ఉన్న కాలువలో అపారిశుధ్యం తాండవిస్తూ దీనిలోని మురుగు నీరు పలు వీధులలోకి ప్రవేశించి దుర్గంధాన్ని వెదజల్లేది. అయితే రామారావు ఈ కాలువ పూడికతీత పనులు చేపట్టి సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా మాడుగులలోని పలు వీదులలోని కాలువలలో కూడా పూడికతీత పనులు చేయించి తుప్పలను తొలగించడంతో గతంలో నెలకొన్న అపారిశుధ్యం ప్రస్తుతం చాలావరకు సమసిపోయింది. స్థానిక మోదమాంబ కాలనీకి వెళ్లే దారి లోతట్టు ప్రాంత కావడంతో నీరు నిలిచిపోయి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడేవారు. దీనిని గుర్తించిన ఆయన లోతట్టు ప్రాంతాన్ని నివారించేందుకు సిమ్మెంట్ ర్యాంప్ నిర్మాణం చేపట్టడంతో మోదమాంబకాలనీ వాసులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. కొబ్బరితోట వీధి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే రహదారి తుప్పలతో నిండిపోయి భయానికంగా మారగా దీనిని కూడా ఆయన తొలగించడంతో పలువురుకు సౌకర్యంగా ఏర్పడింది. స్థానిక డిగ్రీ కళాశాలకు స్థలం మంజూరు కాకపోవడంతో విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారించిన తాహశీల్ధార్ స్థల సేకరణ చేపట్టి డిగ్రీ కళాశాలకు భవనాలు నిర్మించుకునేందుకు మార్గం సుగుమం చేసారు. తన దృష్టికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తుండడంతో స్థానికులు రామారావు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
డప్పు కళాకారుల ప్రదర్శన
మాడుగుల, నవంబర్ 13: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపు మేరకు మాడుగులలో మంగళవారం డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.ఎం.దాసు ఆధ్వర్యంలో డప్పు కళాకారులు బస్టాండ్ నుంచి తాహశీల్ధార్ కార్యాలయం వరకు డప్పు ప్రదర్శన చేసి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఎం.ఆర్.పి.ఎస్. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందక్రిష్ణ మాదిగ పోరాట ఫలితంగా జి.ఒ.నెం.25ను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అయితే ఈ జి.ఒ.ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, డప్పు కళాకారులకు పించను మంజూరు చేయాలని ఆయన కోరారు. అనంతరం డిప్యూటీ తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్. ప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, జి.పెంటారావు, ఎ.గాటీలు, సి.హెచ్.దేముడు, పోతురాజు, సంజీవరావు, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.