విశాఖపట్నం

విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 13: విద్యతో పేదరికాన్ని జయించవచ్చునని ఏపీ పుడ్ కమిషన్ సభ్యుడు ఎల్‌బి వెంకటేశ్వరరావు అన్నారు. చైల్డ్‌రైట్స్‌ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మధురానగర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, నోటు పుస్తకాలు పంపీణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించిన నిరుపేద విద్యార్థులు, విద్యతో పాటు వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. బాలల హక్కుల కోసం చైల్డ్‌రైట్స్ ప్రోటెక్షన్ ఫోరం వంటి సంస్థలు సమాజసేవకులందరినీ ఒకే వేదికగా చేర్చి నిరుపేద బాలలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. జీవీ ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి.రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, వారికి మరింత సహకారాన్ని అందించాలన్నారు. చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.సీతారామ్ మాట్లాడుతూ విభిన్న వర్గాల విద్యార్థుల మధ్య బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించడం, దీనికి సహకరించిన దాతల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న మళ్ల పూజిత సుష్మ, ఇంజనీరింగ్ విద్యార్థి శ్రావ్య, కె.లీలకార్తికేయలు విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ సమావేశంలో మధురానగర్ పాఠశాల హెచ్ ఎం బి.దేముడుబాబు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వై.కృష్ణ, ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శకుంతల, ఉపాధ్యక్షుడు తిర్లంగి హరి, ప్రధాన కార్యదర్శి జీవీ కుమార్, సభ్యులు ఎల్లయ్య, వేణుగోపాల్, వెంకటేష్, ఉపాధ్యాయులు స్వామి, రమ,చంద్రిక తదితరులు పాల్గొన్నారు.