విశాఖపట్నం

సమాజ ప్రగతి సాధకులు...బాలలే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి బాలలే రేపటి పౌరులు...బాలలదే భవిష్యత్ భారతం. ప్రస్తుత బాలలు..్భవిష్యత్ ప్రగతి సాధకులు... ఇవీ అన్ని వినటానికి బాగానే ఉన్నా... ఆచరణలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. యాంత్రిక జీవనంలో నిత్యం మానసిక ఒత్తిడి, చిరుప్రాయం నుంచే మార్కుల కోసం కుస్తీ, మెయలేని పుస్తకాల బరువు తదితర ఘటనలన్ని నేటి బాలలను మానసిక వికాశం లేకుండా చేస్తున్నాయి. మహ కవి శ్రీశ్రీ, చాచాజీ నేహ్రు కలలగన్న సమాజం స్వతంత్య్రం వచ్చి ఆరు పదులు దాటుతున్న నేటికి ఎటువంటి మార్పు కానరాలేదు. బాలలకు అన్ని హక్కులు కల్పిస్తున్నామని, బాలల సంక్షేమమే మా ధ్యేయమని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవటమే తప్ప కార్యరూపం దాల్చే పరిస్థితి ఏక్కడా కనిపించటం లేదు. నేడు సమాజంలో బాలల హక్కులను సైతం భంగం కలిగిస్తూన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటికి బాలలంతా ఈసురోమంటునే జీవనం సాగిస్తున్నారు..బాలల హక్కుల రక్షణకు కృషి చేసిన పండింట్ జవహర్‌లాల్ నేహ్రు(చాచాజీ) జయంతి సందర్భంగా ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
==========
జగదాంబ, నవంబర్ 13: దేశం అభివృద్ధి పధంలో నడవాలంటే నేటి బాలల్లో వికసించే మనసుతో పాటు చైతన్యం, ప్రతిబావంతమైన స్పూర్తి ఎంతగానో అవసనం. కానీ ప్రస్తుత సమాజంలో చిన్నారుల పాఠశాల దశ నుంచి మానసిక ఒత్తిడికి గురవుతూనే వున్నారు. మార్కులే ప్రామాణికంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఈ విధానాలను అవలంభిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో బాలలకు పలు హక్కులను కల్పించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే హక్కు, ఉచిత, నాణ్యమైన విద్యను పోందే హక్కు, వినోద హక్కు ఇలా పలు రకాలగా విభజించి బాలల కోసం వారిని మరింత ప్రతిబావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయెగపడతాయి. కానీ నేటి సమాజంలో ఇవి ఎక్కడా అమలు జరగకపోవడమే కాకుండా హరించబడుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కూడా బాలలు, విద్యార్థులకు వారికి అందాల్సిన హక్కులు, చట్టాల వినియెగంపై ఇటు అధికారలు, అటు ప్రజా ప్రతినిధులు కనీసం పట్టించుకోక పోవడం గమనర్హం.
* పిల్లల అభిరుచిని గుర్తించాలి
పిల్లల్లో చిన్న వయస్సు నుంచి వారిలోని అభిరుచిలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. విద్యార్థుల్లో వున్న ప్రతిభను, సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఎందరో వ్యక్తులు గోప్పవారైన వారు లేక పోలేదు. వారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో తెలుపుకోని చిన్న నాటి నుంచే దానికి తగిన విధంగా ప్రణాళికను రూపోందించి వారి ఆలోచనలు, ఆశయాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులతో పాటు గురువులకు కూడా వుంది.
బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలిన అవసరం ఎంతగానో ఉంది.
* బాలల హక్కుల కోసం సీఆర్‌ఫీఎఫ్ కృషి
బాలల హక్కుల కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. విద్యార్థులకు స్వేచ్చాను కల్పించి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. మానసిక ఒత్తిడి లేకుండా వారి హక్కులను కల్పించి ఉన్నత చదువులు చదువుకునేలా చూడాలి. మనోవికాశంతో పాటు శారీరక వ్యాయమంపై కూడా చిన్న వయస్సు నుంచే ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బాలల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసి వారికి అధికారాలు ఇవ్వాలి. బాల్యవిహాహలు, ఆత్మాహత్యలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. చైల్డ్‌రైట్స్‌ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

పిల్లల అభిరుచిని గుర్తిస్తే మంచి ఫలితాలు
బాలల చిన్న వయస్సు నుంచి వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకోని వారు కోరుకున్న రంగాలల్లో రాణించేలా వారిని ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచి మానసిక ఒత్తిడి లేకుండా మన్శశాంతితో కాలం గడిపేలా చూడాలి. మానసిక ఒత్తిడి కారణంగానే చదువులో వెనుకబడే అవకాశాలు లేకపోలేదు. తల్లిదండ్రులు చిన్నారుల కదలికలపై దృష్టిసారించాలి. దీని ద్వారా భావితారలల్లో ఉన్నత శిఖరాలను సులువుగా చేరవచ్చు. నిత్యం చదువులో మార్కుల కోసం కుస్తీనే కాకుండా, ఆటపాటలకు,సాహిత్య కళలలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాలల క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన అవసరం
* నేడు వుడాచిల్డ్రన్ ఏరీనాలో విజయోత్సవ వేడుకులు
జగదాంబ, నవంబర్ 13: బాలల దినోత్సావాన్ని పురస్కరించుకొని ఇటీవల కాలంలో అధికంగా నమోదవుతున్న బాలల క్యాన్సర్ కేసులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదిన సిరిపురం వుడాచిల్డ్రన్ ఏరీనాలో సదస్సును నిర్వహించనున్నట్లు మహాత్మాగాంధీ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి.మురళీకృష్ణ తెలిపారు. నగరంలో మంగళవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా చికిత్స పొంది విజయవంతమైన బాలలచే బాలల దినోత్సవం సందర్భంగా విజయోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా బాలల్లో తొలిదశలో క్యాన్సర్‌ని గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చునని, జన్యువుల మార్పు కారణంగా పిల్లలకు క్యాన్సర్ వ్యాధి సక్రమిస్తుందన్నారు. నేటి వరకూ చిన్నారుల విషయంలో పది రకాల క్యాన్సర్ వ్యాధులను గుర్తించారని, వీటికి గుర్తించిన రెండు, మూడు రోజుల్లోనే చికిత్స అందిస్తే 80నుంచి 90 శాతం వరకూ వ్యాధి తీవ్రతను తగ్గించగలమన్నారు. అంతేకాకుండా బాలల్లో వచ్చే క్యాన్సర్ రోగులకు కూడా శస్తచ్రికిత్స ద్వారా నయం చేయవచ్చునని, ఆత్యాధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా బ్లడ్‌క్యాన్సర్,బోను క్యాన్సర్‌లను తగ్గించవచ్చున్నారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇప్పటి వరకూ వ్యాధి నయం కాబడిన 150కిపైగా చిన్నారులను సమీకరించి, వారి తీసుకున్న వైద్యసేవలు,జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయనున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ మెట్రోపాలిటిన్ కమిషనర్ పి.బసంత్‌కుమార్ హాజరువుతారన్నారు. విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేష్‌రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.