విశాఖపట్నం

భూ కుంభకోణంపై సిబీఐ దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 13: సంచలనం కలిగించిన విశాఖ భూ కుంభకోణంపై సిట్ అధికారుల నివేదికపై రాజకీయ పక్షాలు, మేథావులు పెదవి విరుస్తున్నాయి. కేవలం అధికార పార్టీ నాయకులకు క్లీన్ చిట్ ఇచ్చే విధంగానే సిట్ విచారణ జరిగిందని, అధికారులను పావులుగా చేసి రాజకీయ నేతలు తప్పించుకునేందుకు మాత్రమే ఇది చూడాలని జనసేన, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) అభిప్రాయపడ్డాయి.
జనసేన ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన ధర్నాలలో ఆపార్టీ నేత శివప్రసాద్ మాట్లాడుతూ సిట్ నివేదికను తప్పుపట్టారు. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి, ఎమ్మెల్యేలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సిట్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం ఎందుకు బహిర్గత పరచట్లేదని ప్రశ్నించారు. అధికారులకు సైతం ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందన్నారు. మంత్రి గంటా అనుచరులు పరుచూరి భాస్కరరావు, కాశీ విశ్వనాద్, ఎమ్మెల్యే పీలా గోవింద్, బండారు సత్యనారాయణపై పలు అభియోగాలున్నాయన్నారు. సిట్ తనకు అందిన 2875 ఫిర్యాదుల్లో కేవలం 344 ఫిర్యాదులు మాత్రమే విచారణకు స్వీకరించడం ప్రభుత్వ కనుసన్నల్లోనే సిట్ పనిచేసిందనడానికి నిదర్శనంగా పేర్కొన్నారు. సిట్ నివేదికను తక్షణమే బహిర్గత పరచి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దూలం గోపి, అప్పారావు, శ్రీనివాస్, కళావతి, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

జ్యుడీషియల్ విచారణకు యూపీఎఫ్ డిమాండ్
భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరపాలని యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఫ్రంట్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం ఆధ్వర్యంలో సమావేశమైన ఆయన భూ కుంభకోణంపై నిజాలు నిగ్గు తేలాలంటే న్యాయ విచారణ ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన వారిని విడిచిపెట్టి అమాయకులపై దాడులు చేస్తారన్నారు. కొంతమంది అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నేటి నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
సింహాచలం, నవంబర్ 13: అడివివరం శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో బుధవారం నుండి 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసామని గ్రంథాలయ అధికారిణి వై. పద్మజ నేడొక ప్రకటనలో తెలియజేసారు. బుధవారం ఉదయం గ్రంథాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా,మండల, జోనల్ స్థాయిలో విద్యార్థులకు వివిద పోటీలను నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. వారోత్సవాలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

నేడు డయల్ యువర్ డీఎం
సింహాచలం, నవంబర్ 13: ప్రయాణీకుల సౌకర్యార్థం బుధవారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సింహాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ హరిదాసు దివ్య నేడొక ప్రకటనలో తెలియజేసారు.ప్రయాణీకులు 9959225592 నంబర్‌కి కాల్ చేసి తమ పరిధిలోని సమస్యలు తెలియజేయడంతో పాటు సూచనలు చేయాలని ఆమె కోరారు.

అడివివరంలో కావాలి జగన్ ...!
సింహాచలం, నవంబర్ 13: భీమునిపట్నం నియోజక వర్గం మహావిశాఖ నగరపాలక సంస్థ అడివివరం ఎస్సీ కాలనీలో మంగళవారం కావాలి జగన్..రావాలి జగన్ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల, జీవీఎంసీ 72వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు జగన్ అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఉందంటూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజల అభ్యర్థించారు. వైసీపీ ఇప్పటికే ప్రకటించిన నవరాత్నాల పథకాలను ప్రచారం చేస్తూ ప్రజలకు అవగహన కల్పించారు.

నేడు నృసింహ వనంలో పీవీజీ వర్థంతి
సింహాచలం, నవంబర్ 13: విజయనగర సంస్థానాధీశుడు,సింహాచలం దేవాలయ అనువంశిక ధర్మకర్తల కుటుంబానికి చెందిన దివంగత పూసపాటి విజయరామ గజపతిరాజు (పీవీజీ) వర్థంతి బుధవారం దేవస్థానం నృసింహ వనంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి ఎంవీ. కృష్ణమాచార్యులు నేడొక ప్రకటనలో తేలియజేసారు. వనంలోని పీవీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంటు సభ్యుడు పీ.అశోకగజపతిరాజు కుమార్తె మాన్సాస్ డైరెక్టర్ అదితి గజపతి హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.