విశాఖ

మన్యాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, నవంబర్ 15: విశాఖ ఏజెన్సీలోని గిరిజన రైతులు కరవు కోరల్లో చిక్కుకుని కోలుకోలేకపోతున్నారని సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు అన్నారు. వర్షాభావ పరిస్థితులలో పంటలు నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకుని పదకొండు మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ స్థానిక తాహశీల్ధార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న రైతాంగం ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పంట భూములకు సాగు నీరు లేకపోవడంతో పచ్చని రంగుతో కలకలలాడాల్సిన పంట పొలాలు బీడుగా మారిపోయాయని వారు వాపోయారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గిరిజన ప్రాంతంలోని పంటలన్నీ ఎండిపోయాయని, ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు కురవకపోవడంతో పంటలు చేతికి అందే పరిస్థితి లేదని వారు అన్నారు. తిండి గింజలు కూడా కానరాని పరిస్థితిలో గిరిజన రైతులు ఏలా బతికేదంటూ ఆవేదన చెందుతున్నారని వారు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మన్యాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని వారు కోరారు. రైతులను ఆదుకోకపోతే పంటల సాగుకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని బాలదేవ్, రామారావు చెప్పారు. అనంతరం తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు జి.చినబాబు, నానిబాబు, జగన్నాధం, గిరిజన రైతులు పాల్గొన్నారు.

మాడుగులను సందర్శించిన ఆర్థిక సంఘం కమీషన్
మాడుగుల, నవంబర్ 15: రాష్ట్ర ఆర్థిక సంఘ కమీషన్ బృందం సభ్యులు గురువారం మాడుగులను సందర్శించారు. కమిషన్ చైర్మన్ జి.నాంచారయ్య ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు గల బృందం స్థానిక మేజర్ పంచాయతీలో పర్యటించి ఆర్థిక సంఘం నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి వాటి గురించి ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పథకాల అమలులో ప్రజల నుంచి దేనికి స్పందన ఉందనే విషయమై వారు చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు, వౌళిక వసతులు అనేకం జరిగాయని వారు చెప్పారు. పంచాయతీకీ ఏ విధంగా ఆదాయం సమకూరుతుంది, ఎంత వ్యయవౌతుంది, ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలను సమీక్షించారు. పంచాయతీలకు ఆదాయం బట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వారు చెప్పారు. పంచాయతీలకు ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు దృష్టి సారించాలని వారు సూచించారు. మండలంలో ఎన్ని పంచాయతీలు, ఎంత మంది జనాభా వంటి వివరాలను పంచాయతీ విస్తరణ అధికారి అప్పారావును వారు అడిగి తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న సమస్యలను స్థానిక నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మండలంలోని మారుమూల ప్రాంతాలలో నిర్వహిస్తన్న గ్రానైట్ క్వారీల వలన ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యులు జయసింహనాయుడు, నాగరాజు, భాస్కరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పంటల బీమా మంజూరు చేయాలని వినతి
మాడుగుల, నవంబర్ 15: 2012వ సంవత్సరానికి సంబంధించిన పంటల బీమా రైతులకు అందలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు జాయింట్ ఫార్మంగ్ గౌరవ అధ్యక్షుడు జి.సన్యాసయ్యదొర గురువారం విలేఖరులకు తెలిపారు. డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రిని కలిసి మండలంలోని పదమూడు వందల 70 మంది రైతులకు పంటల బీమా అందాల్సి ఉన్న విషయాన్ని తెలియచేసినట్టు ఆయన చెప్పారు. ఈ విషయమై అధికారులకు పలుసార్లు తెలియచేసినా స్పందించలేని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. బకాయి ఉన్న పంట బీమాను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందచేసినట్టు ఆయన చెప్పారు.
హల్వా దుకాణాలు తనిఖీ
మాడుగుల, నవంబర్ 15: హల్వా తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఆహార భద్రత అధికారి ఎస్.వేణుగోపాల్ హెచ్చరించారు. మాడుగుల, ఘాట్‌రోడ్డు జంక్షన్‌లలో విక్రయిస్తున్న హల్వా దుకాణాలనలు ఆయన గురువారం పరిశీలించి హల్వా తయారీ చేసే వంటశాలను తనిఖీ చేసారు. ఈ దుకాణాలకు ఉన్న లైసెన్స్‌ల కాలపరిమితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హల్వా వ్యాపారులు నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ పునరుద్ధరించుకోవాలని ఆయన అన్నారు. హల్వా తయారీ చేసే వంటశాలలో పరిశుభ్రతను పాటించాలని ఆయన చెప్పారు. అనంతరం రసాయనిక పరీక్షలకు పంపేందుకు హల్వాను సేకరించారు. ఈ పరీక్షల్లో నాణ్యత లోపించినట్టు తేలితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఘాట్ రోడ్డు జంక్షన్‌లో ఉన్న వాటర్ ప్లాంట్‌లను ఆయన పరిశీలించారు.
సమస్యలపై వినతి
మాడుగుల, నవంబర్ 15: మండలంలోని ఎం.కోడూరు గ్రామంలో నెలకొన్న సమస్యలపై వరసిద్ధి వినాయక గ్రామ అభివృద్ధి సంఘం యువకులు గురువారం స్థానిక తాహశీల్ధార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. దాదాపు రెండు వేల మంది జనాభా కలిగిన ఎం.కోడూరు గ్రామంలో లోవోల్టేజి, పారిశుధ్యం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు చెప్పారు. తమ గ్రామంలో హోమియో ఆసుపత్రి ఉన్నా వైద్యులు లేక నిరుపయోగంగా మారిందని వారు అన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
గిరిజన రైతులను ఆదుకోవాలి
పెదబయలు, నవంబర్ 15: మండలంలో సంబవించిన పంట నష్టానికి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. కార్యకర్తలు గురువారం పెదబయలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. నాయకుడు బొండా సన్నిబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన వరి, రాజ్‌మా, అలిసెలు వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నట్టు ఆయన అన్నారు. రెవిన్యూ అధికారులు గ్రామాలలో పర్యటించి పంట నష్టంపై సర్వే చేయాలని ఆయన కోరారు. వర్షాభావ పరిస్థితులలో నెలకొన్న కరువు పరిస్థితిని అధిగమించేందుకు రైతులను ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. అనంతరం స్థానిక తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు కిల్లో శరభన్న, కొర్రా కోమటి, బత్తిరి రామారావు, జంబు భీమన్న, చెడ్డా పరశురాం తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు ముందుకు రండి
పాడేరు, నవంబర్ 15: విశాఖ మన్యంలో చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేందుకు గిరిజన నిరుద్యోగ యువత ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక సంస్థ జిల్లా మేనేజర్ జి.రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక కాఫీ హౌస్‌లో గురువారం నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలను స్థాపించుకునేందుకు ముందుకు వచ్చే గిరిజన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన అన్నారు. అయితే గిరిజన యువతలో సరైన అవగాహన లేకపోవడం వలన వారికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. దీనిని గుర్తించిన తమ సంస్థ యువతకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఆర్థిక సంస్థ, ఐ.టి.డి.ఎ., జాతీయ చిన్న తరహ పరిశ్రమల సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు ద్వారా పరిశ్రమల స్థాపనకు గిరిజన యువతకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలు వంటి అనేక అంశాలను వివరిస్తున్నట్టు ఆయన చెప్పారు. సదస్సుకు హాజరైన యువత అన్ని విషయాలను విశే్లషించుకుని చిన్న తరహ పరిశ్రమలను స్థాపించుకునేందుకు ఆశక్తి కనబరచాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువత పరిశ్రమలను స్థాపిస్తే తామంతట తాము అభివృద్ది చెందడమే కాకుండా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాము ఎంచుకున్న రంగంలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా తోడ్పాటునిస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ పి.ప్రసాదరావు, అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామక్రిష్ణ, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ అధికారి వీరభద్రరరావు, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి మూర్తి, వివిధ మండలాలకు చెందిన గిరిజన యువత, తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలి
అరకులోయ, నవంబర్ 15: పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని స్థానిక శాఖా గ్రంధాలయ అధికారి జి.మురళీక్రిష్ణ కోరారు. 51వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శాఖా గ్రంధాలయంలో గురువారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతరం పుస్తక పఠనానికి దూరవౌతుందని అన్నారు. పుస్తక పఠనంపై ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు ఆశక్తి చూపాలని ఆయన కోరారు. విద్యార్థులు తరగతి పుస్తకాలకు, ఉద్యోగులు కార్యాలయాల రికార్డులు, గృహిణిలు ఇంటి పనులకే పరిమితం కాకుండా గ్రంధాలయ సందర్శనను అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ జ్ఞానాన్ని పొందేందుకు గ్రంధాలయ సేవలను సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. వారోత్సవాల సందర్నంగా రానున్న మూడు రోజుల్లో పలు అంశాలపై పోటీలు నిర్వహించనున్నట్టు మురళీక్రిష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలలు, పాఠశాలల అద్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.