విశాఖపట్నం

ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవరచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదగంట్యాడ, నవంబర్ 15: ప్రతి ఒక్కరు పుస్తక అలవర్చుకోవడం మంచి అలవాటని న్యూపోర్టు సిఐ సోమశేఖర్ అన్నారు. పెదగంట్యాడ శాఖ గ్రంథాలయంలో 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి వి.శిరీషా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రెండవ రోజు గురువారం జరిగే పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని న్యూపోర్టు సిఐ సోమశేఖర్ ప్రారంభించారు. సిఐ సోమశేఖర్, సాహితీ సుధ వ్యవస్ధాపకులు అద్దంకి రాఘవాచారి, గ్రంథాలయ విశ్రాంత అధికారి బి.అమ్మాజీ, వి.శిరీషా తదితరులు పాల్గొని ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఐ పాల్గొని మాట్లాడుతూ చిన్నవారి నుండి పెద్ద వారి వరకు పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం వలన ప్రపంచ జ్ఞాణం అలవడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చిన తరువాత చానల్స్, ఇతర చాయాచిత్రాల ద్వారా ప్రపంచంలో ఏ క్షణంలో ఏమి జరిగినా వెంటనే తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అయితే పుస్తక పఠనం వలన మంచి స్నేహితున్ని కలిగి ఉన్నట్లు అవుతుందన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. సాహితీసుధ వ్యవస్ధాపకులు అద్దంకి రాఘవాచారి మాట్లాడుతూ విద్యార్ధుల్లో పుస్తక పఠనం అలవర్చాలన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులే కాకుండా ప్రతి ఒక్కరు గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలను చదవాలన్నారు. గ్రంథాలయాల్లో దినపత్రికలు, విజ్ఞాణ శాస్త్ర గ్రంథాలు, కథలు, కవితలు, సాహిత్యం ఇలా అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

జగన్‌ను విమర్శించే అర్హత పవన్‌కు లేదు
పెదగంట్యాడ, నవంబర్ 15: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదనలి వైసిపి ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్టుపూడి పరదేశి అన్నారు. గాజువాకలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జగన్మోహన్‌రెడ్డిని పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో, ఎవరు దోపిడీ దారులో, చట్టానికి దొరక్కుండా ప్రజల సొమ్మును, ప్రభుత్వ ఆస్ధులను లూఠీ చేస్తున్నారో, అన్యాయాన్ని, అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా..అని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక ఇతర రాజకీయ పార్టీలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తు అవాకులు, చవాకులు పలుకుతున్నాయని అన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, అన్యాయం ఓడిపోకతప్పదన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాన్ని విస్మరించి విమర్శలకు దిగడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.