విశాఖపట్నం

నాయినా రాజేష్ రా..రా.. ఇంటికి వెళ్లి పోదాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, నవంబర్ 15: నాయినా రాజేష్...త్వరగా రా..రా.. ఐదు రోజుల నుండి స్నానం చేస్తున్నావా...త్వరగా వస్తే ఇంటికి వెళ్లి పోదాం..రా అంటూ యారాడ బీచ్‌లో గల్లంతైన ఆరుగురు యువకల్లో ఒకరైన ఫోటోగ్రాఫర్ ఎస్.రాజేష్ తల్లి వెంకటలక్ష్మి ఆవేదన ఇది. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం హెచ్‌బికాలనీకి చెందిన ఆరుగురు యువకులు యారాడ బీచ్‌లో కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. ఆరుగురుల్లో ఐదుగురు యువకులు విగత జీవులగా బయటకు వచ్చారు. అయితే ఆఖరి ఆరో యువకుడైన ఎస్.రాజేష్ ఆచూకీ మాత్రం నేటికీ లభించలేదు. గల్లంతైన రోజు నుండి ప్రతీ రోజు రాజేష్ తల్లి యారాడ బీచ్‌కు వచ్చి కుమారుడు కోసం సాయంత్రం వరకు ఎదురు చూచి తిరిగి ఇంటికి వెళ్తున్న వైనం. యారాడ్ బీచ్ వద్ద కొడుక కోసం ఎదురు చూస్తున్న వెంకటలక్ష్మిని చూచి ప్రతీ ఒక్కరు కంట తడి పెడుతున్నారు. గత ఐదు రోజుల నుండి ఆమె పరిస్థితి ఒకే లా ఉంటుంది. బంధువులతో కలిసి యారాడ బీచ్‌కు రావడం, కుమారుడు ఆచూకీ లభించక పోవడం రాత్రికి ఇంటి ముఖం పట్టడం చేస్తున్నారు. నిద్రహారాలను మాని కుమారుడు రాక కోసం వెంకటలక్ష్మి ఎదురు ఇసుక తినె్నలపై కూర్చోని ఎదురు చూస్తున్నారు. నాయినా రాజేష్ ఐదు రోజుల నుండి స్నానం చేస్తున్నావా...త్వరగా రా..రా ఇంటికి వెళ్లి పోదామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐదు రోజుల నుండి ఆమె కన్నీరు కార్చడంతో ప్రస్తుతం ఆమె కంటిలో నీళ్లు నిండుకున్నాయి. బరువెక్కిన గుండెతో కుమారుడు రాక కోసం ఆమె చూస్తున్న చూపులు అందరికీ కంట తడి పెట్టిస్తున్నాయి.
లభ్యం కానీ రాజేష్ ఆచూకీ...
యారాడ బీచ్‌లో గల్లంతైన వారిలో ఫోటో గ్రాఫర్ రాజేష్ ఆచూకీ ఐదవ రోజు గురువారం లభ్యం కాలేదు. న్యూపోర్టు ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ నేతృత్వంలో ఎస్సై శ్రీనివాసరావు సారధ్యంలో నాలుగు బృందాలు గురువారం యారాడ బీచ్ నుండి అప్పికొండ బీచ్ వరకు తీరం వెంబడి గాలింపు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం తుపాన్ కారణంగా సముద్రంలో బోట్లు వెళ్లలేని పరిస్థితి. దీనికారణంగానే తీరం వెంబడి గాలింపును కొనసాగిస్తున్నారు. గురువారం రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సై శ్రీనివాసరావు సాయంత్రం వరకు తీరం వెంబడి గాలింపు చేసినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం యధావిధిగా తీరం వెంబడి రాజేష్ ఆచూకీ కోసం అనే్వషణ చేస్తామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
వైసీపీ విజయానికి కృషి చేయండి
పెదగంట్యాడ, నవంబర్ 15: పార్టీ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేసి 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని వైసిపి గాజువాక నియోజక వర్గం కన్వీనర్ తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవిఎంసి గాజువాక జోనల్ పరిధి 63వ వార్డులో గురువారం వైకాపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటనలో జాప్యం జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమన్నారు. చంద్రబాబు కొంగజపం ప్రజలకు తెలియనిది కాదని, బిజెపితో విడిపోయి బద్ద శత్రువైన కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారని అన్నారు. అధికార దాహంతో చంద్రబాబు ఏదైనా చేయగల సమర్ధుడని ఎద్దేవా చేశారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం తలపెట్టాయని, దోపిడి వ్యవస్ధలుగా మారాయని ఆరోపించారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఖరిని గమనిస్తున్నారని, 2019లో జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పనున్నారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు న్యాయం జరిగే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.