విశాఖపట్నం

డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్లుకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 15: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లుకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్ ఉద్యోగ పరిరక్షణ సాధన సమితి బృంద నాయకులు వినతి పత్రాన్ని అందించారు. నగరంలోని ఎంవీపీకాలనీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన క్వాలిఫైడ్ ఉద్యోగులంతా మంత్రిని కలసి తమకు న్యాయం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు క్వాలిఫైడ్ ఉద్యోగులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సభ్యులంతా కోరారు. అలాగే 1998 డీ ఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్‌స్కేల్ పద్దతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేల కమిటీ నివేదికను అందించిందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని తమకు న్యాయం చేయాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల సమస్య పరిష్కారమై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి, అర్హులైన వారిందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు పి.సరస్వతి రామస్వామి, విశాఖ జిల్లా ప్రతినిధులు పి.శ్రీనివాసరావు,అప్పారావు,అప్పలనాయుడు, గణేష్,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించాలి
జగదాంబ, నవంబర్ 15: ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విశాఖ సీటీ పోలీస్, హోమ్‌గార్డ్స్ ఫుట్‌బాల్ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న శ్రీ డీవీ రెడ్డి పుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా రెండో రోజు కార్యక్రమానికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్ గాంథీ ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఫుట్‌బాల్ క్రీడాకారులు మరింత అభివృద్ధిలోకి రావాలని ఆక్షాంక్షించారు. భవిష్యత్తులో వైసీపీ అధినేత జగన్ సారధ్యంలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో ఫుట్‌బాల్ క్రీడాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.అలాగే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియానికి మళ్లీ అంతర్జాతీయ స్టేడియంలాంటి మహర్థశను తీసకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్ క్రీడాకారులు డీవీ రెడ్డి,రాంబాబు,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

ఇక జీవీఎంసీ విద్యార్థులకు ఈ-హెల్త్‌కార్డులు
* తొలి విడతలో 122పాఠశాలలు,10,295 మంది విద్యార్థులకు అమలు
* ప్రతీ మూడు నెలలకు విధిగా వైద్యపరీక్షలు నిర్వహణ
* విద్యార్థులందరికీ డిజిటల్ లాకర్లు ప్రారంభం
జగదాంబ, నవంబర్ 15: అంతర్జాతీయ నగరం, స్మార్ట్‌సీటీగా అభివృద్ధి చెందుతున్న మహా విశాఖ నగరంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, వారికి మరింత భద్రతకు ప్రాధానమిచ్చేలా ఈ-హెల్త్ ప్రాజెక్టును అమలు చేయనుంది. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిల్లలకు ఈ-హెల్త్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్‌ను ప్రారంభించాలని జీవీ ఎంసీ అధికారులు నిర్నయించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జవహర్ బాల ఆరోగ్యరక్ష, రాష్ట్రీయ బాల స్వస్థతో పాటు నూతన స్మార్ట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నూతన విధానంతో పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనున్నారు. అంతేకాకుండా ఈ పథకంలో భాగంగా విద్యార్థి ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా ఆనారోగ్య సమస్యలుంటే ఆయా విద్యార్థులకు తక్షణ వైద్యసేవలందిస్తున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, విద్యార్థి ఎత్తు, బరువు, రక్తకణాల సంఖ్య, హిమెగ్లోబిన్ శాతం, విటమిన్‌లోపాలు, కంటిచూపు, పోషకాహర లోపాలు తదితర సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే ముందస్తుగా డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అంతేకాకుండా విద్యార్థులందరికీ డిజిటల్ హెల్త్‌లాకర్స్‌ను అందించి, వారికి ప్రత్యేకంగా యూజర్‌నేమ్,పాస్‌వర్డ్‌నుందిస్తారు. ఈ డిజిటల్ లాకర్ జీవితకాలం విద్యార్థి ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేలా రూపొందించనున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి విద్యార్థులకు నిర్వహించే వైద్య పరీక్షల్లో ఏదైనా ఆరోగ్య పరంగా తేడాలుంటే వాటిని సకాలంలో గుర్తించి, మొరుగైన వైద్యసేవల కోసం ఉన్నత వైద్యులకు రిఫర్ చేస్తారు. విద్యార్థుల ఆరోగ్యస్థితిలపై తల్లిదండ్రులకు సమాచారం అందించి,వారిలో కూడా అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్ధి ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ నూతన ప్రాజెక్టును జీవీఎంసీ ఆధ్వర్యంలో సిద్థం చేస్తుంది. ఈ హెల్త్‌ప్రాజెక్టు రెండున్నర సంవత్సరాల వయస్సున్న పిల్లల నుంచి 17 ఏళ్ల వరకూ డిజిటల్ హెల్త్‌రికార్డులు నిర్వహాణ బాధ్యతల్ని సదరు ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ పూర్తి బాధ్యత వహించనుంది. అంతేకాకుండా ప్రతీ పాఠశాల్లో టెక్నికల్ హెల్త్‌డెస్క్,టెలీ కన్సల్టేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి తల్లిదండ్రులకు సమగ్ర సమాచారాన్ని ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అందించనున్నారు. ఈ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేలా పాఠశాల ఉపాధ్యాయులకూ త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు.
* పదివేల విద్యార్థులు...122 పాఠశాలలు
జీవీఎంసీ అమలు చేయనున్న ఈ-హెల్త్ కార్డుల ప్రాజెక్టును ముందుగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలు చేసేందుకు జీవీఎంసీ నిర్ణయించింది. దీంతో జీవీఎంసీలోని 122 పాఠశాలల్లో 10,295 మంది విద్యార్థులకు ఈ డిజిటల్ హెల్త్‌లాకర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా త్వరలోనే అనకాపల్లి,్భమిలి సహా పలు జోన్లలోని పాఠశాలల్లో ఈ హెల్త్ సౌకర్యం అందేలా ప్రాజెక్టుని రూపొందించారు. నగరంలో ఉన్న రెండోజోన్‌లో 17ప్రైమరీ పాఠశాల్లో,మూడో జోన్‌లో22ప్రైమరీ, ఒక ప్రాథమికోన్నత పాఠశాల,నాల్గొ జోన్‌లో 39 ప్రైమరీ పాఠశాలలు, ఆరవ జోన్‌లోని ఒక ప్రాథమికోన్నత పాఠశాలలు,్భమిలిలో 19ప్రైమరీ, రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు,అనకాపల్లిలో 21ప్రైమరీ పాఠశాలల్లో ఈ-హెల్త్ కార్యక్రమం అమలు కానుంది.
* విద్యార్థుల ఆరోగ్యంతోనే విద్యాభివృద్ధి
జీవీఎంసీలో విద్యార్థులకు ఎంతోప్రతిష్టాత్మాకంగా అమలు చేయనున్న ఈ-హెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలందనున్నాయి. వారిలో అనారోగ్య సమస్యల కారణంగా చదువులో వెనకబడే పరిస్థితి ఉంది. ఇకపై విద్యార్థులకు కంటిచూపు, రక్తహీనత తదితర వైద్యసేవలపై ప్రతీ మూడు నెలలకోసారి వైద్యపరీక్షలు చేయనున్నారు. తొలి విడతగా 122 పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యసేవలందనున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థుల డిజిటల్ లాకర్‌ను ప్రారంభించి వాటిపై ప్రతీ పాఠశాలల్లో ఉపాధ్యాయలకు త్వరలోనే శిక్షణ అందించనున్నాం.
--బి.లక్ష్మీనరస, జీవీఎంసీ డిప్యూటీ డీఈవో

ఎక్కడి పనులు అక్కడే...!
* జీఎస్టీ సమస్య పరిష్కారించేదాకా పనులు చేపట్టం * బోర్డు ఆఫ్ ఇంజనీర్స్ నిర్ణయాన్ని తక్షణమే సవరించాలి
* సగంలోనే నిలిచిపోయిన కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు * నిరసన చేపట్టిన జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్
జగదాంబ, నవంబర్ 15: జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులంతా తమ పెండింగ్ సమస్యలు, ప్రధానమైన జీఎస్టీ సమస్యను పరిష్కరించేదాకా ఎట్టిపరిస్థితిలోనూ నగర అభివృద్ధి పనులు చేపట్టేది లేదని జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. సమ్మె తొలిరోజు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లుంతా నిరసన చేపట్టారు. దీంతో ఇప్పటికే నగరంలో పలు జోన్‌ల్లో చేపడుతున్న కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు ఎక్కడికెక్కడి నిలిచిపోయాయి. పూర్తిస్థాయిలో పరిధిలోని పలు అభివృద్థి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లుంతా తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించని కారణంగా సమ్మెబాట పడుతున్న విషయం తెలిసిందే. కేవలం బోర్డు ఆఫ్ ఇంజినీర్స్ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా కనీస లాభాలు లేకుండా నష్టాలబాట పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు వీరారెడ్డి, చంద్రవౌళీలు మాట్లాడుతూ కాంట్రాక్టర్లుకు జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎస్‌వోఆర్ రేట్లును తగ్గించి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా కోత విధించడంతో తామంతా నష్టపోతున్నామని,ఇప్పటికే ఎన్నో సార్లు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కమిషనర్, రాష్ట్ర మున్సిపల్ అధికారులతో చర్చలు నిర్వహించినా ఏమాత్రం ప్రయోజంలేని కారణంగా చేసేది ఏమీ లేక సమ్మెలోకి వెళ్లి అభివృద్ధి పనులను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు.దీని కారణంగా జీవీ ఎంసీ ప్రస్తుతం చేపడుతున్న నగరాభివృద్ధి, స్మార్ట్‌సీటీ పనులు సుమారు 300కోట్ల అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయన్నారు. తక్షణమే అభివృద్ధి పనుల విషయంలో ముందస్తుగా చేసిన అగ్రిమెంట్ ప్రకారమే ఆయా ప్రతిపాదనల పనులకు జీఎస్టీ విధించాలని, అలాకాకుండా ఎస్‌వోఆర్ రేట్లును తగ్గించి మరీ జీఎస్టీ విధించడంతో కాంట్రాక్టర్లుంతా తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ సిఫార్స్ మేరకు విడుదలైన జీవోలో అగ్రిమెంట్ చేసిన రేట్లు కంటే 11నుంచి 22శాతం తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవీ ఎంసీ అసోసియేషన్ నాయకులు రాజన వెంకటరావు, ఉపాధ్యక్షుడు సాధురావు,వీరభధ్రరావు,అప్పన్న, వరప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.