విశాఖ

రాహూల్ పాలన కోసం ప్రజలు ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, నవంబర్ 17: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహూల్‌గాంధీ పాలన కోసం యావత్ దేశంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారని అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఐఆర్ గంగాదర్ అన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీనాయకులు, కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పట్టణ ప్రధాన కార్యదర్శి మొగలపల్లి సుబ్బారావుజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఆర్ గంగాదర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీజేపీలు ప్రజావ్యతిరేక పాలనను సాగిస్తూ ప్రత్యేకహోదా హామీని అమలు చేయకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసారన్నారు. దేశంలో సుస్థిర పాలన అందించాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహూల్‌గాందీ ప్రధానమంత్రి అయితే మళ్లీ ఇందిరమ్మ రోజులు వస్తాయని, బడుగు,బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో మ్యానిఫెస్టోను,కరపత్రాలను పంపిణీచేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ పట్టణాధ్యక్షులు బోయిన భానుమూర్తియాదవ్, పట్టణ ఉపాద్యక్షులు తుట్టా రమణ, మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గాడ భాస్కరరావు, యువజనవిభాగం అధ్యక్షులు ఇళ్ల నూకేష్ భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఉద్ధేశపూర్వకంగానే మరోసారి మోసం చేసిన అగ్రీసంస్థ

అనకాపల్లిటౌన్, నవంబర్ 17: గుండెకాయలాంటి అగ్రీగోల్డ్ ఆస్తులతో హాయ్‌ల్యాండ్ ఆస్తిని ఎగచూపి ఇటు ప్రజలను, అటు ఏజెంట్లను ఆకర్షింపజేసి వేలాదికోట్ల రూపాయలు వ్యాపారాలు చేసి దాచుకుంటున్న అగ్రీగోల్డ్ కంపెనీని ఈరోజు హయ్‌ల్యాండ్ తమది కాదని హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడం చూస్తే ఇది ఉద్ధేశ్యపూర్వకంగానే ప్రజలను మోసగించి సొమ్ములు కాజేసారని తెలుస్తుందని అగ్రీగోల్డ్ సంఘం అధ్యక్షులు కరణం మాణిక్యాలరావు ఆరోపించారు. శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాయ్‌ల్యాండ్ తమది కానప్పుడు ఏ విధంగా వాటిని చూపి ప్రజలనుండి డిపాజిట్లు సేకరించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి అగ్రీగోల్డ్ మోసం తేటతెల్లమైనందున మొత్తం ఆస్తులన్నీ ఎటాచ్ చేసి స్వాధీన పరుచుకోవాలని, వేలం ప్రక్రియను ప్రారంభించి కస్టమర్స్‌కు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు కోన లక్ష్మణ, ఉప్పల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పాడిరైతులకు బీమా పశు ధీమా

మునగపాక, నవంబర్ 17: పాడిరైతుల సంక్షేమమే లక్ష్యంగా విశాఖడెయిరీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పశుబీమా పథకం ఒకటని ఇది పాడిరైతులకు ధీమాగా కూడా నిలుస్తుందని విశాఖడెయిరీ జెవో రెడ్డి వరప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక బల్క్‌మిల్క్ సెంటర్ వద్ద ఇద్దరు పాడిరైతులకు పశుబీమా చెక్కును అందజేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖడెయిరీ సేవలు దేశంలోనే ఇతర డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పశుబీమా రైతుసంక్షేమ పథకాలు నేడు పాడిరైతుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పాడిరైతులు విశాఖడెయిరీని సందర్శించి ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నారంటే అది విశాఖడెయిరీ ఆడారి తులసీరావు కృషి పలితమేనని కొనియాడారు. ఈ సందర్భంగా దాడి వీరవెంకటప్పారావుకు 35వేలు, కాండ్రేగుల సైదునాయుడుకు 26వేల రూపాయల ఫశుబీమా చెక్కులను అందజేసారు. ఈకార్యక్రమంలో పాలసంఘం అధ్యక్షులు కె. జగ్గారావు, వేతన కార్యదర్శి వెంకట సత్యనారాయణ, డైరెక్టర్ మళ్ల జగ్గఅప్పారావు, పెంటకోట కృష్ణ, సూపర్‌వైజర్ ఆది అప్పారావు, ఎఆర్‌వి మహేష్ తదితరులు పాల్గొన్నారు.