విశాఖపట్నం

నడిపించిన మానవత దృక్ఫథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళనం, రాజస్థాన్ సంస్కృతి మండల్ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వికలాంగుల కృత్రిమ అవయువాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటైంది. దీనిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్, ఎండీ డాక్టర్ టి.బాబూరావునాయుడు శనివారం మహారాణిపేట రాజస్థాన్ మండల్‌లో ప్రారంభించారు. వికలాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ళు, కేలీవర్స్ అమర్చే శిబిరంలో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు చెందిన 530 మంది వికలాంగులకు పరికరాలు ఉచితంగా అందజేశారు. ఈ మేరకు వక్తలు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో దివ్యాంకులకు ఉచిత కృత్రిమ కాళ్ళు, కేలీవర్స్‌ను సామాజిక సేవలో భాగంగా అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులు ఎవరి సహాయం లేకుండానే నడవటం, పరుగెత్తడం, సైకిల్,కారు, ఆటో వంటి వాహనాలు నడిపే విధంగా కృత్రిమ అవయువాలను ఉచితంగా అమర్చడం ఎంతో ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ సంఘాల నేతలు డాక్టర్ సతీష్, కుమార్‌జైన్, వినోద అగర్వాల్, సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ, మోషీన్ ఐ బ్యాంకు చైర్మన్ ఆదిశెట్టి శ్రీరామమూర్తి, డాక్టర్ బీఎం శివప్రసాద్, వి.్భస్కరచారి, చంద్‌మాల్ అగర్వాల్, యూజేఎఫ్ కార్యదర్శి నాగబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
====
ఉచిత శివపంచాక్షరి పుస్తకాలు పంపిణీ
విశాఖపట్నం, నవంబర్ 17: కార్తీక మాసం సందర్భంగా యోగ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 46వేల శివ పంచక్షరి పుస్తకాలను పంపిణీ చేశారు. గత నెల 28వ తేదీ నుండి 38వేల పుస్తకాల పంపిణీ జరిగిందని చైర్మన్ పైడినాయుడు తెలిపారు. మధురవాడ, ఎంవీపీ, ఎన్‌ఏడీ, గాజువాక పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు అళ్వార్‌దాస్ మైదానంలో 10వేల మంది భక్తులతో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
=====

మధురం శృతిరవళి గానం
ఆరిలోవ, నవంబర్ 17: ప్రఖ్యాత గాత్ర సంగీత కళాకారిణి మండాశృతి రవళి (వంక) కృతులు, కీర్తనలను మధురంగా గానం చేసి సంగీతప్రియులను అలరించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ (విఎండిఏ) ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో శృతిరవళి కర్ణాటక సంగీత గాత్ర కచేరి జరిగింది. ముందుగా ముఖ్యఅతిథి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎస్‌ఎన్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అకాడమీ కార్యదర్శి జిఆర్‌కె ప్రసాద్ (రాంబాబు), మందా సుధారాణి, వంకా పవన్ పాల్గొన్నారు. మరకమణిమయ చేల...(ఆరభి ఆది), రామనన్ను నమ్మిన...(మోహన, ఆది) ఆది, శ్రీ వల్లి దేవసేనాపతే...(నాటభైరవి ఆది) వంటి కృతులు, కీర్తనలను వీనులవిందుగా గానం చేసి ఆహుతుల కరతాళధ్వనులందుకున్నారు. హెచ్.రామ్‌చరణ్ వయోలిన్‌పై, పీ.్ఫల్గుణ్ మృదంగంపై లయవాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా అతిథులు శృతిరవళి, పవన్ దంపతులను ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ఆహుతులు ఆద్యంతం కీర్తనలను ఆసక్తిగా విన్నారు.

======

ఉచిత బాలల చిత్రాల ప్రదర్శన
ఆరిలోవ, నవంబర్ 17: పిల్లల్లో మానసిక పరివర్తనకు, ఆలోచనా పరిధిని పెంచేలా రూపొందించిన బాలల చిత్రాల ఉచిత ప్రదర్శన శనివారం సాయంత్రం ఆరు గంటలకు బాలల ప్రాంగణంలో ప్రారంభమైంది. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆదిత్య అనే బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. పిల్లల్లో పరిశోధనాశక్తిని పెంపొందిస్తూ, కుల రహిత సమాజానికి బాటలు వేయాలనే సందేశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఉచిత బాలల సినిమాల ప్రదర్శన ప్రారంభ కార్యక్రమానికి వీఎంఆర్డీఏ సెక్రటరీ ఏ.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన చిన్నారులతో మాట్లాడుతూ చిన్నారుల మానసిక ఉల్లాసంతో పాటు ఆలోచనశక్తిని పెంపొందించేందుకు ఉచితంగా బాలల చిత్రాల్ని ప్రదర్శిస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని రానున్న రోజుల్లో ప్రదర్శిస్తామని ప్రకటించారు. ఈ చక్కనైన అవకాశాన్ని విశాఖ చిన్నారులు వినియోగించుకోవాలన్నారు. దీనికి ఆదిత్య సినిమా దర్శకులు సుధాకర్ గౌడ్ హాజరై చిన్నారులతో ప్రత్యేకంగా ఓ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాని ప్రకటించారు. సినిమాలో నటించాలని ఆసక్తి గల విశాఖ చిన్నారులకు తన చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నగరానికి చెందిన పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు పెద్దఎత్తున హాజరై సినిమాను ఆద్యంతం ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హరిప్రసాద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.