విశాఖపట్నం

సీబిఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా అడ్డుకోవడం సరైందికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: సీబిఐ ఎంట్రీని (ప్రవేశాన్ని) రాష్ట్రంలో రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం సృష్టిస్తూ మేథావులను, ఆలోచింపజేస్తుందని సిఐఏ సెంటర్ డైరెక్టర్ వై.రామన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ (సీబిఐ)కు కోర్టు ఆదేశాల మేర ఏ రాష్ట్రంలో అయినా విచారించే అధికారం ఉందని, వాదన గట్టిగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఆ సంస్థ కేవలం ఢిల్లీకే పరిమిమైందని మన రాష్ట్రం వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సాధారణ సమ్మతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయానికి ముందు రాష్ట్భ్రావృద్ధి, భవిష్యనిధి విధానాలు పరిగణనలోకి తీసుకున్నట్టు లేదన్నారు. నిలకడ లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండటం అన్నివేళలా శ్రేయదాయకమన్నారు. ఇక్కడ న్యాయస్తానాల విస్తృత పరిధిని, అధికారాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదన్నారు. సీబిఐ దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాలు భావించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
====
15వ వార్డులో ద్రోణంరాజు విస్తృత పర్యటన
విశాఖపట్నం, నవంబర్ 17: నగరంలో 15వ వార్డులో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యాదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ శనివారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దొండపర్తి ఎరుకుమాంబ ఆలయం దరి కుమ్మరివీది, హరిజనకాలనీ, మండావారివీధి, శెట్టిబలిజవీధి, నెహ్రుబజార్ ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యల్లారెడ్డి, తోట దుర్గారావు, వైఎస్ జగన్, జీవీ రమణ, ఎస్.అప్పారావురెడ్డి, ఫాతీమా భేగం పాల్గొన్నారు.
=====

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
* బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ర్యాలీ
విశాఖపట్నం, నవంబర్ 17: ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం స్థానిక రైల్వేన్యూకాలనీశాఖ ఈ నెల మూడవ తేదీ ఆదివారం 3అన్ వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్2ను పురస్కరించుకుని శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీ వంటి నిర్వహిస్తూ సమాజానికి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విశ్వశాంతి పాదయాత్ర నిర్వహించారు. సుమారు 150 మంది బ్రహ్మాకుమారీ సోదరీసోదరులు, స్వచ్ఛంద సమాజ కార్యకర్తలు రైల్వేన్యూకాలనీ గణేష్ గుడి వద్ద బ్రహ్మాకుమారీ ఆశ్రమం నుండి సింహగిరి లాడ్జి జంక్షన్, శ్రీనివాసకళ్యాం మండపం, రైల్వే ఇనిస్టిట్యూట్‌ల మీదుగా రైల్వేస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్తూ ప్లకార్డులు, కరపత్రాలతో, స్లోగన్ బోర్డుల ద్వారా పాదచారులకు, వాహనచోదకులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించారు. వ్యక్తిగత, సామాజిక బాధ్యత గురించి అవగాహన కల్పిస్తూ, సురక్షితమైన రోడ్డు ప్రయాణాలపై వివరించారు. రైల్వేస్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాద బాధితులకు,బాధిత, ప్రభావిత కటుంబాలకు రాజయోగ మెడిటేషన్ ద్వారా శాంతియోగం, చేస్తూ వారికి ధైర్యం చేకూర్చాలని ప్రార్ధించారు. సురక్షితమైన రోడ్డు ప్రయాణం కోసం ప్రతిజ్ఞ చేయించి, హెల్మెట్, సీట్‌బెల్టు ధరించాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఇతరులకు గౌరవించాలన్నారు. ఈ విధంగా సమాజంలో పరస్పరం అవగాహనతో, సోదరభావమనతో మెలగాలని సూచించారు. స్థానిక రైల్వేన్యూకాలనీ బ్రహ్మాకుమారీశాఖ ఇన్‌చార్జి సోదరి బికె శశికళ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఏసీపీ కింజరాపు ప్రభాకరరావు జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు.