విశాఖపట్నం

ప్రతి ఏటా జిల్లాలో ‘ లిటరసీ ఫెస్ట్’ నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: విశాఖపట్నం జిల్లాలో జూనియర్ ‘ లిటరసీ ఫెస్ట్’ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, దీనివలన పిల్లల్లో మంచి అభిరుచులు పెంపోందుతాయని, మంచి పౌరులగు నిలుస్తారరని రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం మంత్రి స్థానిక హవామహల్‌లో జూనియర్ లిటరసీ ఫెస్ట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నంలో నిరంతరం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు. విశాఖపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయ నగరంగా రూపొందుతోందన్నారు. లిటరసీ ఫెస్ట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహాకులు మంత్రి అభినందించారు. లిటరీ ఫెస్ట్‌ను వచ్చే ఏడాది కూడా తప్పకుండా నిర్వహించాలని దానిని విద్యాశాఖ స్పాన్సర్ చేస్తుందన్నారు. ఇదే కార్యక్రమాన్ని ఇంకా పెద్దఎత్తున నిర్వసించాలన్నారు. టెక్‌ఫెస్ట్ జిల్లాలో జరుగుతోందని ఈ రోజు వైజాగ్ డిక్లరేషన్ జరుగుతుందని, అదేరోజున లిటరసీ ఫెస్ట్ నిర్వహించడం సరైందిగా అభివర్ణించారు. ప్రస్తుతం పలు పాఠశాలల్లో విద్యార్థులకు పది జిపిఏ, ఉన్నత స్థాయిల కోసం పోటీ పడుతున్నారని, అది సరికాదన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. అలాగే పిల్లలు చిన్న వయస్సులోనే లక్ష్యాలను నిర్ధేశించుకోవాలన్నారు. ఏ రంగం ఎంచుకున్నా వారి లక్ష్యం ఉన్నతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్, నవయుగ ఇండస్ట్రీస్ ఎండీ చింతా మోహన్, మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశం లిటరరీ ఫెస్ట్ నిర్వాహకులు సంధ్య, ప్రియ, సోనాలి, చింతా వెంకటకృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేవారు.

====

70 మంది గీతం ఎబిఏ విద్యార్థులకు ఉద్యోగాలు
విశాఖపట్నం, నవంబర్ 17: ఇంజనీరింగ్‌లోనే కాక ఎంబిఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లోను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతున్నారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో శనివారం జరిగిన వివిద కంపెల ప్రాంగణ నియామకాల్లో మొత్తం 70 మంది ఎంబిఏ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించారని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా తెలిపారు. వాల్‌మార్ట్ వంటి బహుళజాతి సంస్థతోపాటు బంధన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, నెస్లే, ఇన్‌వెస్కో, మూత్తూట్ ఫైనాన్స్, నౌకరీడాట్‌కామ్ వంటి సంస్థలు ఈ ప్రాంగణ నియామకాలను చేపట్టాయన్నారు. గీతం ఎంబిఏ హ్యూమన్ రీసోర్సు మేనేజ్‌మెంట్ విద్యార్దిని తేజస్వికి వాల్‌మాల్ట్ సంస్థ తొమ్మిది లక్షలు వార్షిక వేతతాన్ని ఆఫర్ చేసిందని ప్రిన్సిపాల్ తెలిపారు. రానున్న నెల రోజుల్లో మరికొన్ని సంస్థలు సహితం ప్రాంగణ నియామకాలకు తేదీలు ఖరారు చేశాయని తెలిపారు. గత ఏడాది అర్హులైన ఎంబిఎ విద్యార్థుల్లో నూరుశాతం మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించాయని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది ప్రముఖ కంపెనీల్లో ఎంపికకు విద్యార్థులు సిద్ధమవతున్నారన్నారు. కాగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులను వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎమ్‌ఎస్ ప్రసాదరావు, ప్రో-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎమ్.పోతరాజు, గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగం డైరెక్టర్ కెవి ఉమాదేవి అభినందించారు.
====
ఆన్‌లైన్‌లో గీతం ప్రవేశ పరీక్ష ధరఖాస్తులు
విశాఖపట్నం, నవంబర్ 17: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్‌లతోపాటు బెంగళూరు క్యాంపస్‌లో ఇంజనీరింగ్, ఫార్మశీ, ఆర్క్‌టెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గీతం.ఎడ్యు ద్వారా ధరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర తెలిపారు. ఇంజనీరింగ్‌లో 10బి.టెక్ క్సోలకు, ఇసిఇ మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఆరేళ్ళ డ్యూయల్ డిగ్రీ కోర్సులు (బి.టెక్+ఎమ్.టెక్), 19ఎమ్.టెక్ కోర్సులకు, బి,్ఫర్మశి, ఎమ్.్ఫర్మశి కోర్సులకు, ఐదేళ్ళ బి.ఆర్ కోర్సుకు, రెండేళ్ళ ఎమ్.ఆర్క్ కోర్సుకు గ్యాట్-2019 ప్రవేశ పరీక్షను అఖిల భారత స్థాయిలో దేశంలోని 50 పట్టణాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తోందన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు గ్యాట్-2019 రాయాల్సి ఉంటుంద్నారు. గ్యాట్-2019 ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖల్లో లభిస్తాయని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర పేర్కొన్నారు. పూర్తి చేసిన ధరఖాస్తులను 2019వ సంవత్సరం మార్చి 30వ తేదీలోపదు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి గీతం వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్ష పూర్తయిన వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 26వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కె.నరేంద్ర తెలిపారు.