విశాఖ

పేదలకు అందుబాటులో వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, నవంబర్ 18: వైద్యాన్ని పేదలందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పెదబొడ్డేపల్లి థెరిస్సా కాలనీలో 4.50 లక్షలతో నిర్మించిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం భవనానికి మాజీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అవుట్ పేషెంట్స్ విభాగంతో పాటు టెలీమెడిషన్ ఈకేంద్రంలో ఉంటుందన్నారు. ప్రాథమిక చికిత్సలతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారన్నారు. ప్రతీ రోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నాం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆసుపత్రి పని చేస్తుందన్నారు. కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖా మంత్రిగా కొనసాగిన కాలంలో ఈ ఆసుపత్రిని మంజూరు చేసారని, అలాగే ప్రాంతీయ ఆసుపత్రికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో నెలకు 460 ప్రసవాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పని సరిగా ఉండాలన్నారు. భవిష్యత్‌లో వీటి ప్రాదాన్యత మరింత పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా వెయ్యి రేషన్ కార్డులు, పట్టణంలో 250 కార్డులు మంజూరు చేసామన్నారు. మున్సిపాలిటీలో ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ళు నిర్మించుకునేందుకు 10,452 మంది లబ్దిదారులకు 2.50 లక్షలు చొప్పున మంజూరు చేసామన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సీ ఎం ఆరోగ్య కేంద్రాల మొదట ఆర్బన్ హెల్త్ సెంటర్ పేరుతో ఉండేవని, వాటిని ఆధునీకరిస్తూ విశాఖపట్నం, విజయవాడల్లో మోడల్‌గా ప్రవేశపెట్టామన్నారు. టెలీమోడ్‌లో 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. తాను మాజీ మంత్రి అయినప్పటికీ తనపై ఉన్న గౌరవంతో ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం మంత్రి అయ్యన్నపాత్రుడు గొప్పతనంగా ఆయన పేర్కొన్నారు. నర్సీపట్నం ఆసుపత్రిని రాష్ట్రంలోనే అద్బుతంగా తీర్చిదిద్దిన మంత్రి అయ్యన్నపాత్రుడు, వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించారు. 33 శాతం ఓపీ ,98 శాతం ప్రసవాలు పెరగడానికి గతంలో తీసుకున్న చర్యలే కారణం అన్నారు. ఈకార్యక్రమంలో కాకినాడ పోర్టు అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పట్టణం ఆసుపత్రి సూపరెంటెండెంట్ సుధాశారద , ఎంపీపీ రమణమ్మ, మున్సిపల్ కమీషనర్ సురేంద్ర పాల్గొన్నారు.

ఉచిత వైద్యశిబిరానికి అనూహ్య స్పందన

నర్సీపట్నం, నవంబర్ 18: అన్నపూర్ణ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐదు రోడ్ల జంక్షన్ వద్ద జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి మంది రోగులకు ఈశిబిరంలో వైద్య సేవలందించారు. రోగులకు బీపీ, సుగర్, ధైరాయిడ్ వంటి రుగ్మతలకు రక్తపరీక్షల ద్వారా వైద్యం అందించారు. ఈసందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న అన్నపూర్ణ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, అయ్యన్నయువసేన అధ్యక్షుడు విజయ్‌బాబు, మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి,డాక్టర్ సువర్ణ, కాకినాడ పోర్టు చైర్మెన్ వెంకటేశ్వరరావు, అవంతి ఫుడ్స్ సీ ఇ ఓ ఇంద్రకిరణ్, ఎంపీపీ రమణమ్మ, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండే కఠిన చర్యలు

నాతవరం, నవంబర్ 18: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఆదివారం తుని, నర్సీపట్నం ప్రధాన రహదారి ఎంబీపట్నం వద్ద ప్రయాణీకులకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను విస్మరించే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రతీ ఒక్కరూ హెల్మెట్‌తో పాటు రికార్డులు తప్పని సరిగా ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోరాదన్నారు. అదే విధంగా డ్రైవర్ పక్క సీట్లు ఎవ్వరీ ఎక్కించుకోరాదన్నారు. ఈకార్యక్రమంలో ఎ ఎస్సై కళ్యాణ్‌రాజు, కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.