విశాఖ

పర్యాకులతో కళకళలాడిన వల్సంపేట, అల్లూరి పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట,నవంబర్ 18: కార్తీక వన భోజనాలు సందర్భంగా వల్సంపేట, అల్లూరి పార్కులు సందర్శకులతో కళకళలాడింది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల నుండి ప్రత్యేక వాహనాల్లో కుటుంబ సమేతంగా ఇక్కడకు వందలాదిగా పర్యాటకులు విచ్చేసి కార్తీక వన భోజనాలు చేసారు. వల్సంపేట జలపాతం వద్ద మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి జలపాతంలో స్నానాలు చేసారు. యువకులు, విద్యార్ధులు పలు కల్చలర్స్ పొగ్రాంలు నిర్వహించి ఆనందంగా గడిపారు. పలు వర్గాల వారు ప్రత్యేక వనభోజనాలు నిర్వహించుకున్నారు. అల్లూరి పార్కులో పలు పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులు, వ్యాపారులు కుటుంబ సమేతంగా పార్కులో సందడి చేసారు. అల్లూరి జీవిత చరిత్ర చిత్రపటాలు, కాంస్యవిగ్రహాలతో అనేక మంది సెల్పీలు దిగి ఫిక్నిక్ సందడి చేసారు. రెండవ ఆదివారం కావడంతో ఈ ప్రాంతంలో వల్సంపేట జలపాతం, అల్లూరి పార్కు కార్తీక వనభోజనాలతో కళకళలాడింది.

హత్యాయత్నం చేస్తున్న టీడీపీ నాయకులు

కోటవురట్ల, నవంబర్ 18: ప్రజా సంకల్ప యాత్రకు ఫ్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండడంతో తెలుగుదేశం నాయకులు ఓర్వలేక జగన్‌పై హత్యాయత్నంకు పాల్పడ్డారని వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త వరుధు కళ్యాణి ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 300 రోజులు అయిన సందర్భంగా ఆదివారం మండలంలో సుంకపూర్‌లో పాయకరావుపేట నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు ఆధ్వర్యంలో కళ్యాణి కేక్‌ను కట్ చేసారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కళ్యాణీ మాట్లాడుతూ జగన్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. జగన్‌పై హత్యాయత్నంపై పార్టీ సీబీ ఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేయగా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో సీబీ ఐను అనుమతించకుండా జీవో జారీ చేయడంపై కళ్యాణీ అభ్యంతరం వ్యక్తం చేసారు. వైసీపీ పంచాయతీరాజ్ రాష్ట్ర కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల అబీష్టానికి వ్యతిరేకంగా పరిపాలన సాగుతుందన్నారు. ప్రజా సంకల్ప యాత్ర సంక్రాంతికి పూర్తవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, పార్టీ సమన్వయకర్త వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దత్తుడు సీతబాబు, నాయకులు రాంబాబురాజు, చిరంజీవి రాజు, చంటిబాబు, ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, పైల రమేష్, ఎస్‌వీ రమణమూర్తి పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనకు అనూహ్య స్పందన

కోటవురట్ల, నవంబర్ 18: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. మండలంలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు స్థానిక గ్రంధాలయానికి వచ్చి పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్థానిక గ్రంథాలయాధికారి ఎన్.రాజుబాబు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలను వెల్లడించారు. విజ్ఞానానికి సంబంధించి పుస్తకాలతో పాటు భారతం, రామాయణం, భాగవతాలకు సంబంధించిన ఇతిహాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలతో పాటు చరిత్రకు సంబంధించి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రంథాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

హిందూ సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

మాకవరపాలెం, నవంబర్ 18: హిందూ సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పుష్పగిరి శారదాలక్ష్మి నృసింహా పీఠాధిపతి భారతీస్వామి అన్నారు. మండలంలోని భీమబోయినపాలెంలో ఆదివారం గాయిత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా స్వామి వారి శిష్యులతో రుద్రాభిషేకం, శివనామ కీర్తనలతో ఈవన మహోత్సవం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు హిందూ సాంప్రదాయాలు, సాంస్కృతులపై అవగాహన కల్పించాలన్నారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడేది మహిళలే అన్నారు. అనంతరం కోళ్ళ సత్యనారాయణ ముద్రించిన 2019 డైరీలను ఆవిష్కరించారు. గాయిత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధనలక్ష్మి, శ్యామల ప్రసంగించారు. వివిధ ఆటల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో సంఘం సభ్యులు, మండల పరిధిలో ఉన్న బ్రాహ్మణులు పాల్గొన్నారు.