విశాఖ

పర్యాటకులతో సందడిగా వాడ్రాపల్లి ఆవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, నవంబర్ 19: పర్యాటకులతో వాడ్రాపల్లి ఆవలో సందడి నెలకొంది. మండలంలోగల వాడ్రాపల్లి ఆవలో కార్తీకమాసంలో ఆదివారం సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు తరలివచ్చారు. పక్షులు కిలకిలరావాలతో ఎప్పుడూ సందడిగా ఉండే వాడ్రాపల్లి ఆవ కార్తీకమాసం వచ్చిందంటే వేలాదిగా తరలివచ్చి ప్రసిద్ధిచెందిన శ్రీ దక్షిణేశ్వర స్వామిని, వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్న అనంతరం వాడ్రాపల్లి ఆవలో బోటుషికారు చేస్తారు. కాలుష్యానికి దూరంగా స్వచ్చమైన గాలిని అందిస్తూ ఆవలో తామరపూల సోయగాల మధ్య బోటుషికారు చేస్తుంటే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. కొండకర్ల-వాడ్రాపల్లి గ్రామాల మధ్యలో చుట్టూకొండలతో సుమారు 1400 హెక్టార్ల వైశాల్యంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ ఆవను సందర్శించడానికి వేలాదిగా పర్యాటకులు, భక్తులు తరలివస్తారు. ఆదివారం కావడంతో పర్యాటకులు వాడ్రాపల్లికి తరలివచ్చారు. గాజువాక, అక్కయ్యపాలెం, అనకాపల్లి నుండి పర్యాటకులు తరలివచ్చి రోజంతా ఆవలో బోటుషికారు చేస్తూ ఆనందంతో గడిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై నుండి చూస్తే కోనసీమను తలిపించే విధంగా కొబ్బరిచెట్లు మంచి ఆహ్లాదాన్ని, అనుభూతినిస్తాయి. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫైబర్ బోట్లు సమకూర్చడంతో బోటుపై సులువుగా 20నుండి 40మంది పర్యాటకులను ఆవ చుట్టూ తిప్పుతూ జీవనోపాది కలుగుతుందని మత్స్యకారులు అంటున్నారు.

నేడు జిల్లా దేశం కార్యకర్తల విస్తృత సమావేశం
అనకాపల్లి, నవంబర్ 18: తెలుగుదేశం పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశం విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం జరుగుతుందని జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావుతెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాపార్టీ కార్యవర్గ సభ్యులు, మండల పార్టీల అధ్యక్షులు, జిల్లాపార్టీ అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఈ సమావేశంలో పాల్గొంటారని నాగజగదీష్ కోరారు.

నేడు ఇంటింటికి కాంగ్రెస్ ముగింపుసభ
అనకాపల్లి, నవంబర్ 18: స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఐఆర్ గంగాదర్ మాట్లాడుతూ స్థానిక నెహ్రూచౌక్ కూడలివద్ద మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ 101వ జయంతి కార్యక్రమం ఇంటింటికి కాంగ్రెస్ ముగింపు సభ నిర్వహిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,మహిళలు, యువజన విద్యార్థి విభాగాలు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన భానుమూర్తియాదవ్, ప్రధాన కార్యదర్శి మొగలపల్లి సుబ్బారావు, కోశాధికారి గౌరీపట్నపుగున్నబాబు, అనకాపల్లి మండల ఎస్‌సి సెల్ అధ్యక్షులు కట్టమూరి నూక అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలెపుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతు ఉద్యమ నేతలపై కేసులు రద్దుచేయాలి
అనకాపల్లి, నవంబర్ 18: మునగపాక రైతాంగం సమస్యల పరిష్కారం కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తే రైతునాయకులపై కేసులు బనాయించడం అన్యాయమని జిల్లారైతుసంఘ కార్యదర్శి ఎ. బాలకృష్ణ ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యమానికి రైతునాయకులు బొడ్డేడ ప్రసాద్, ఎ.బాలకృష్ణ, మళ్ల మాదవరావు, ఆళ్ల మహేశ్వరరావు, గౌరీలక్ష్మీ, జెడ్పీటీసీ సంజీవరావు, ఆడారి త్రిమూర్తులు తదితర నేతలు పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఈ కేసులను రద్దుచేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణ కోరుతూ ర్యాలీ

అనకాపల్లి, నవంబర్ 18: పర్యావరణ పరిరక్షణ కోరుతూ అనకాపల్లి గ్రీన్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గ్రీన్‌క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీదర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ర్యాలీని రిటైర్డ్ అటవీశాఖాధికారి వెంకోజు కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ జాతీయ రహదారి నుండి కశింకోట వరకు సాగింది. కశింకోటలో మొక్కల పంపిణీ చేసారు. పర్యావరణాన్ని పరిరక్షించండి, మొక్కలను కాపాడదాం, మంచి ఆరోగ్యాన్ని పొందుదామనే నినాదాలతో ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పెంటకోట ఉమామహేశ్వరరావు, రెడ్డి కృష్ణ, ఎం.సత్తిబాబు, యల్లపుసూరి అప్పారావు

గిరిజనుల సంక్షేమానికి అన్నివిధాలా కృషి
*మంత్రి శ్రావణ్‌కుమార్

చోడవరం, నవంబర్ 18: గిరిజనుల సంక్షేమానికి తనవంతు కృషిచేస్తానని, అవసరమైన సౌకర్యాలన్నింటిని కల్పిస్తానని గిరిజన సంక్షేమ శాఖామంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఇక్కడి ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తనకు గతంలో రాజకీయ పరంగా అనుభవం లేనందున అవసరమైన సమయాల్లో సహాయ సహాకారాలు అందించాలని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజును కోరారు. ఈసందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంతోపాటు మైదాన ప్రాంతంలోని చోడవరం నియోజకవర్గంలోని ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఏ విధమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నామో అదే విధంగా మైదాన ప్రాంతంలో కూడా ఆయా సదుపాయాలను కల్పిస్తామన్నారు. దివంగత నాయకుడు, తనతండ్రి కిడారి సర్వేశ్వరరావు ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తానన్నారు. తండ్రిని కోల్పోయినప్పటికీ తనకు పెద్దదిక్కుగా నిలిచిన ముఖ్యమంత్రి మంత్రి పదవిని కట్టబెట్టి తన కుటుంబం పట్ల ఉన్న ఔదార్యాన్ని చాటారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా శాఖాపరమైన కార్యక్రమాలతోపాటు పార్టీ అభివృద్ధికి కూడా తనవంతు కృషిచేస్తానని అన్నారు. అలాగే రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమీషన్ సభ్యులు ఎస్. ఇబ్రహీమ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు పదవినిచ్చి కల్పించి బాధ్యతను అప్పగించారని ఈ నేపధ్యంలోనే సేవలు అందించేందుకు కృషిచేస్తానన్నారు. అంతకుముందు కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నేతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొడ్డేడ నాగగంగాదర్, గేదెల సత్యనారాయణ, నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.