విశాఖ

జనసేనకు అధికారంతోనే సామాజిక న్యాయం సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 18: జనసేన పార్టీ అధికారంలోకి వస్తేసామాజిక న్యాయం జరుగుతుందని, రాజకీయాలకు తావులేని అభివృద్ధి, ప్రజాసంక్షేమం అమలు జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో నానాటికీ బలపడుతుందని ఆ పార్టీజిల్లా కమిటీ సభ్యులు, అనకాపల్లి నియోజకవర్గ నాయకులు కొణతాల సీతారామ్ అన్నారు. స్థానిక గవరపాలెం సంతోషిమాత గుడివద్ద జనసేన పార్టీ నియోజకవర్గ నేతల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ప్రస్తుత పాలకులు అభివృద్ధిపేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానికేతరులకు అనకాపల్లి అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఏరుదాటాక, తెప్పతగలేసే చందాన్ని అనుసరిస్తున్నారన్నారు. స్థానికునిగా ఆ పరిస్థితిని చూసి సహించలేకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ గ్రామస్థాయిలో బలోపేతమవుతుందని, తెలుగుదేశం,వైసీపీ పార్టీల చర్యల పట్ల విసిగిపోయిన ప్రజలు పవన్ నాయకత్వం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. అనంతరం రెండువేల మందితో విశాఖ సభకు తరలివెళ్లే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాండ్రేగుల సునీల్, దాడి బుజ్జి, దాడి పరదేశినాయుడు, జ్యోతుల గణేష్, అమరపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లిలో దేశం సభ్యత్వనమోదుకు అనూహ్య స్పందన

అనకాపల్లి, నవంబర్ 18: పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తుందని, వివిధ వర్గాల ప్రజలు, యువకులు, మహిళలు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ నారాయణరావు అన్నారు. పట్టణంలోని 3, 4 వార్డులలో ఆదివారం జరిగిన సభ్యత్వనమోదు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పార్టీసభ్యత్వం తీసుకుంటే బీమా సదుపాయం కలుగుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చాక పట్టణంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 25వరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వార్డుల్లో పర్యటించి సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. నూకాంబిక దేవస్థానం మాజీచైర్మన్ కొణతాల వెంకట్రావు, కొణతాల నూకునాయుడు, శివనారాయణ, జిల్లాతెలుగు మహిళా కార్యదర్శి కొణతాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాతోనే ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యం

అనకాపల్లి, నవంబర్ 18:: ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రత్యేక హోదా సాధనతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నిరుద్యోగ జెఎసి, విద్యార్థి, యువజన జేఎసిల ఆధ్వర్యంలో జీపుజాతా ఆదివారం మధ్యాహ్నం అనకాపల్లికి చేరుకుంది. ఇక్కడి నెహ్రూచౌక్ జంక్షన్‌లో స్వాతంత్య్ర సమరయోధులు కె.గోవిందరావు విగ్రహానికి ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాను రాజకీయ పార్టీలు తమ ఓట్లకోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. పాలకుల్లో సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కొరవడిందన్నారు. సినీనటులు, మర్యాదరామన్న ఫేమ్ నాగిరెడ్డి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి రవిచంద్ర, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, సీపీఎం నాయకులు బాలకృష్ణ, సీపీఐ నాయకులు మాదవరావుతదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధన కోరుతూ నినాదాలు చేసారు.

భారతీయ సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించుకోవాలి

మునగపాక, నవంబర్ 18: ప్రతీ ఒక్కరూ భారతీయ సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించుకోవాలని, సమాజహితానికి ఇది ఎంతో దోహదపడుతుందని వెంకటేశ్వర గీతాప్రచార సమితి కన్వీనర్ శరగడం పరదేశినాయుడు అన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన వెంకటేశ్వర గీతా ప్రచార సమితి ధర్మపరిచయ శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రామాయణ, భారత, భగవద్గీతల ఆధారంగా భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకోవాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. భారతీయ సనాతన ధర్మంపై తిరుమల,తిరుపతి దేవస్థానం, విశ్వహిందూ పరిషత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ఇటీవల 52మందికి ప్రత్యేక శిక్షణనిచ్చారన్నారు. ఆ విధమైన శిక్షణలో తనకు కూడా అవకాశం లభించిందన్నారు. ధర్మప్రచారంపై ఈ శిక్షణలో తగుప్రాముఖ్యత కల్పించబబడిందన్నారు. ధర్మప్రచార పరిషత్ ఈ విషయమై రూపొందించిన పుస్తకాలను కార్యక్రమంలో పాల్గొన్నవారికి, ప్రధానంగా విద్యార్థులకు ఎంతో దోహదపడతాయన్నారు. మానవ ధర్మాన్ని తెలిపే జ్ఞానాన్ని పొందడం, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా జీవించేందుకు ఈవిధమైన సదస్సులు ఎంతో దోహదపడతాయన్నారు. బంగారంపాలెంకు చెందిన ఉపాధ్యాయులు బుద్ద దక్షిణామూర్తి, సబ్బవరం హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ, కశింకోట ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నికల్ హెచ్‌వోడి శరగడం గణేష్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.