విశాఖ

విఆర్‌ఓల సంఘ భవనం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, నవంబర్ 18: శిధిలావ్యవస్థకు చేరుకొని రేపోమాపో కూలిపోయే స్థితిలో ఉందని షాపులు ఖాళీ చేయాలని చెప్పిన వినకుండా గత ఎడాది కాలంగా కాలయాపన చేసిన పలితంగా ఎనిమిది షాపులు సంబందించి నేడు ఆ వ్యాపారులు తమ సామాగ్రితో రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. స్థానిక కోర్టుసముదాయం సమీపంలో ఉన్న గ్రామ రెవెన్యూ సంఘం భవనాన్ని 1975లో అనకాపల్లి తాలూకా గ్రామోద్యోగి భవనాన్ని అప్పటి గ్రామ మునిసీబులు, కర్ణాలుగా పనిచేసివారు చందాలు వేసుకొని నిర్మించి రెవెన్యూశాఖామంత్రిగా అప్పటిలో ఉన్న పి నర్సారెడ్డిచే ప్రారంబోత్సవం చేసారు. అప్పటి నుండి జిల్లారెవెన్యూ సంఘం అధ్వర్యంలో ఈ భవనంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేవారు. భవనానికి అనుకొని అప్పటిలో5 షాపులు నిర్మించి వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు.ఆ షాపులో జెరెక్సు సెంటర్లు, జూస్ సెంటర్లు పెటుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ భవనం రానురాను శిధిలావ్యవస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించి కొత్త్భవనం నిర్మించడానికి అప్పుడున్న గ్రామ రెవెన్యూ సంఘం సభ్యులు సిద్దపడ్డారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఈర్లె శ్రీరామూర్తి కృషిమేరకు కొత్త్భవనానికి స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ 25లక్షలు నిదులు మంజూరు చేసారని. మిగాత నిదులులకు సంఘం తరుపున సమకూర్చి నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్దంగా ఉండగా ఈ షాపుల్లో ఉన్న వ్యాపారులను ఖాళీ చేయాలని చెప్పినా వినకుండా కాలయాపన చేసారన్నారు. దీంతో ఆదివారం ఉన్నపలంగా పోక్లైన్ తీసుకొచ్చి శిధిలమైన భవనాన్ని కూల్చడానికి చర్యలు చేపట్టారు. సంఘం సభ్యులకు వ్యాపారుల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఉన్నపలంగా షాపుల్లో ఉన్న జెరెక్సు మిషన్లు తదితర సామాగ్రిని రోడ్డుపైకి తరలించి కూల్చివేసారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌టి రామకాసు, జిల్లా కార్యదర్శి జి పేతూరు, అనకాపల్లి డివిజన్ అధ్యక్షులు అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.

శివునికి రక్తతర్పణం వీరశైవుల మత లక్షణం
*నేడే మునగపాక శూలాల మహోత్సవం

అనకాపల్లి, నవంబర్ 19: శివునికి రక్తతర్పణం చేయడం వీరశైవుల మత లక్షణం. ఆ విధంగా శరీర భాగాలకు ఇనుప చువ్వలు గుచ్చుకుని శూలాలు దరించి శివునిపట్ల తమ భక్తిని చాటుకునే అరుదైన ఉత్సవం మండల కేంద్రమైన మునగపాకలో ప్రతీయేటా కార్తీకమాసం రెండవ సోమవారం విధిగా జరుగుతుంది. ఉత్తరకోస్తాజిల్లాలకే మునగపాక సాంబమూర్తి స్వామిశూలాల మహోత్సవం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. పూర్తిగా చేనేత కార్మికుల సారధ్యంలో జరిగే ఉత్సవం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇక్కడి చేనేత కార్మికులు కర్ణాటకలలోని ఫలనీకి వ్యాపార నిమిత్తం వెళ్లి అక్కడ వారు నిర్వహించే శూలాల మహోత్సవాన్ని తిలకించి అదే ఉత్సవాన్ని ఇక్కడ గడచిన శతాబ్ధన్నర కాలం నుండి ప్రారంభించారు. మునగపాక పరిసర ప్రాంతీయులకు ఇక్కడ వెలిసిన సాంబమూర్తిస్వామిని దర్సించుకుంటే తమ కోర్కెలు తీరతాయని ప్రఘాడ విశ్వాసం. ఆ కారణం చేతనేమో ఈగ్రామస్తుల్లో ఎక్కువగా సాంబశివుడు, సాంబమూర్తి, సాంబశివరావుతదితర నామధేయులు ఎక్కువగా ఉంటారు. కార్తీకమాసం ప్రారంభంలో యువకులు శివమాలలు దరించి గ్రామంలో అన్నివర్గాల వారిని కలుపుకుంటూ జాతర మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈజాతరలో చేనేత కార్మికులు సాంబశివుని సమక్షంలో శరీర భాగాలకు ఇనుప చువ్వలను గుచ్చుకుని శివుని పట్ల తమకు గల భక్తిని చాటుకుంటారు. ఆవిధంగా దరించిన శూలంపై నూనెఖండెలను వెలిగించి గ్రామపురవీదుల గుండా జరిగే సాంబమూర్తిస్వామి ఊరేగింపులో శివతాండవాన్ని పోలిన నాట్యాన్ని చేస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. నాలుకకు, శరీరంలోని మొత్తం భాగాలకు ఇనుపచువ్వలను గుచ్చుకుని నూనెకండెలను వెలిగించి ఉత్సవంలో నృత్యం చేస్తూ పాల్గొనడం సందర్శకులకు ఒకింత గగుర్పాటును, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివునిపట్ల భక్తివిశ్వాసాలకు నిదర్శనంగా ఈ ఉత్సవం జరుగుతుంది. చేనేత కార్మికులు ఉత్సవానికి నెలరోజుల ముందునుండి రెండు అంతస్తులతో కూడిన వివిధ రంగులతో కూడిన నూలుదారాలతో అత్యంత సుందర శోబితంగా సాంబమూర్తి స్వామివారి ఊరేగింపునకు గుమ్మటాలను తయారుచేస్తుంటారు. ఈ గుమ్మటంలో సాంబమూర్తి స్వామిని ఊరేగిస్తారు. మరే జాతరలో లేని ప్రత్యేకత ఇక్కడి జాతరలో గుమ్మటం, శూలాలను దరించిన భక్తుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి చేనేత కార్మికులు కర్ణాటకలోని ఫళనీ వ్యాపార నిమిత్తం వెళ్లి అక్కడ చేనేత కార్మికులు చేసే ఉత్సవాన్ని చూసి ఇక్కడ ప్రారంభించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. సాంబమూర్తిస్వామి శూలాల మహోత్సవం సందర్భంగా గ్రామపురవీధులను విద్యుద్ధీపాలతో అలంకరిస్తారు. వివిధ, సాంస్క్రతిక, జానపద స్టేజి ప్రదర్శనలు, నేలవేషాలు ఇతరత్రా సాంస్క్రతిక ప్రదర్శనలతో సందర్శకులకు కనువిందు కానుంది. జిల్లా నలుమూలల నుండే కాక ఇతర సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి సాంబమూర్తిస్వామి శూలాల మహోత్సవాన్ని తిలకిస్తుంటారు. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని అనకాపల్లి రూరల్ సిఐ రామచంద్రరావు తెలిపారు.