విశాఖపట్నం

అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, నవంబర్ 19: జరగనున్న చట్ట సభలలో ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా రామమందిర నిర్మాణాన్ని చేపట్టాలని విశ్వ హిందూ పరిషద్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి వై రాఘవులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం నగరంలోని పౌర గ్రంధాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాలని తమ సంఘం నిర్ణయించిందన్నారు. న్యాయమూర్తుల తీర్పు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం కన్న నవంబర్ మాసంలో జరగనున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో రామజన్మభూమి ప్రస్తావన వచ్చినప్పుడు అనుకూలంగా వ్యవహరించి, మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంపీలను కోరనున్నామని, ఇందుకు గాను అన్ని రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులను, గవర్నర్‌లను కలిసి వినతి పత్రాలను అందజేయనున్నట్టు చెప్పారు. ఇక డిసెంబర్ మాసంలో రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని ప్రజలు, రామభక్తుల్లోకి తీసుకుని వెళ్లే ఉద్దేశంతో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద యజ్ఞాలు, రామ సంకీర్తనలు, భజనలను పెద్ద ఎత్తున నిర్వాహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. విదేశీ ఆక్రమణదారుడైన బాబర్ 1528లో రామమందిరాన్ని కూలగొట్టారని, ఆ సంఘటన జరిగి నేటికి 490సంవత్సరాలు జరిగినా నేటి వరకు రామజన్మభూమి స్థలం కోసం రామభక్తులు, ప్రజలు యుద్ధాలు చేస్తునే ఉన్నారని, ఇందుకోసం జరిగిన 76యుద్దాలలో సుమారు మూడు లక్షల మంది వరకు రామభక్తులు బలిదానం చేశారని ఆయన వివరించారు. దీనిపై ఉద్యమం నానాటికీ తీవ్రతరం ఆవుతుందని, ఈ ఉద్యమం దేశానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయికి వ్యాపించిందని, ఈ వాస్తవాలను ప్రజా ప్రతినిధులు గమనించి రానున్న పార్లమెంట్ సమావేశంలో రామజన్మభూమి చట్టానికి మద్దతు తెలియజేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విహెచ్‌పి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి నీలకంఠం, కార్యదర్శి ఆర్ అప్పలరాజు, ప్రాంత సహకార్యదర్శి జి సుబ్రమణ్యం, ప్రాంత సహసంఘటన కార్యదర్శి సి శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.