విశాఖపట్నం

కార్తీకం...తగ్గిన జనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: కార్తీక సోమవారం కావడంతో కలెక్టరేట్‌కు తరలివచ్చే బాధితులు తగ్గిపోయారు. వచ్చిన వారిలో కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోని అనేకమంది పదేసార్లు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి. అంగ వికలాంగులు, వితంతువులు, భూకబ్జా, జీతాల్లేని సెక్యూరిటీగార్డులు, రైతులు, యువకులు ఈ విధంగా జిల్లాలో పలు మండలాల నుంచి తమతమ సమస్యలను నేరుగా నివేదించుకునేందుకు తరలివచ్చారు. అయితే ఈ వారం కార్తీకమాసం, అదీ ఏకాదశి పర్వదినం కారణంగా కలెక్టరేట్ ప్రజావాణికి జనం పల్చబడ్డారు. దీనివల్ల కలెక్టరేట్ నడవలో ఏర్పాటుచేసిన పిర్యాదుల నమోదు కౌంటర్లు, సమావేశ మందిరం బయట నడవలో ఉండే బాధితుల కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఆయా విభాగాల అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో రావడంతో హాల్ పూర్తిగా వీరితో నిండిపోయింది. జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి కలెక్టర్ జీ.సృజన ఆధ్వర్వరంలో బాధితుల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రతి వారం అదేపనిగా వస్తున్నా, రోజంతా వినతి సమర్పించుకోవడంతో సరిపోతున్నా సమస్యలు తీరుతాయన కొండంత ఆశతో వస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులకు చెప్పుకోవడంతోనే సరిపోతుందని వీటి పరిష్కామార్గమే కనిపించడంలేదంటూ వృద్ధులు ఆవేదనగా చెబుతున్నారు. ఇక వికలాంగులు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వితంతు, వృద్ధాప్య, వికలాంగులతోపాటుగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు తమతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదేపనిగా రాకతప్పడంలేదు.
హూదూద్ నష్టపరిహారం మింగేశారు...
హూదూద్ తుపాను నష్టాన్ని ఇంతవరకు అందివ్వలేదు. ఆస్తిపరంగా రూ.25వేల వరకు నష్టపోయినట్టు గుర్తించిన అధికారులు ఇందులో కేవలం తొమ్మిదివేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన నష్టపరిహారాన్ని ఇప్పటికీ అందివ్వలేదు. సగానికి పైగా నష్టపరిహారాన్ని తినేశారు. ఎంతో ఆశతో గత నాలుగేళ్ళుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికైనా న్యాయం చేస్తారని కోరుతున్నాను. జిల్లాలో చోడవరం సమీపాన బుచ్చియపేట మండలం కందిపూడి ప్రాంతంలో నివశిస్తున్నాను.

నాలుగు మాసాలుగా జీతాల్లేవు...
గత నాలుగు మాసాలుగా జీతాల్లేవు. అయినా పనిచేస్తున్నాం. జీతాలు గురించి అడిగితే సమాధానంలేదు. ప్రభుత్వ మానసిక వైద్యశాల, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, రాణిచంద్రమణిదేవి ఆసుపత్రిల్లో 70 మంది సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నాం. సంబంధిత కాంట్రాక్టర్ గత నాలుగు మాసాలుగా జీతాలు చెల్లించడంలేదు. దీనివల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించే విషయాన్ని చెప్పడంలేదు. నెలకు రూ.6,500లు వంతున చెల్లిస్తుండగా ఎనిమిది గంటలపాటు పనిచేస్తున్నాం. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్ నుంచి జీతాలు ఇప్పించాల్సిందిగా సెక్యురిటీ గార్డ్స్ యూనియన్‌ను ఆశ్రయించాం. తమ గోడును అధికారులకు వినిపించుకున్నాం.

కబ్జా స్థలాన్ని ఇప్పించాలి
రిటైర్డు పోలీసు ఒకరు తన స్థలాన్ని కొంతమేర కబ్జా చేశారు. మల్కాపురం అంబేద్కర్‌కాలనీలో తాను నివశిస్తున్నాను. ఇందులో కొంత స్థలాన్ని కబ్జా చేయడంతో ఇబ్బందిపడాల్సి వస్తోంది. చివరకు ఆత్మహత్యే శరణ్యమని భావించి తాను ఇటీవల సెల్‌టవర్‌నెక్కాను. దీనిని గురించి అధికారులు సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఆధారాలున్నట్టుగా కాగితాలు చూపడంలేదు. ఇద్దరూ ఆడపిల్లలే. కూలీ చేసుకునే భర్త చనిపోయారు. ఇపుడు రోడ్డునపడ్డాం. ఇప్పటికైనా ఆదుకుంటారని కోరుతున్నాను.

రైతుల భూములను ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు మానుకోవాలి
ఆనందపురం మండలం చందక పంచాయితీ, జగన్నాధపురం గ్రామంలో రైతులంతా తరతరాలుగా నివశిస్తున్నాం. సాగు చేసుకుంటున్న భూమిని గ్రేహౌండ్స్, ఇతర ఐ హబ్‌లకు అధికారులు కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఏకంగా 800 మంది జనాభా నివశిస్తున్నాం. అంతా కేవలం వ్యవసాయం, వ్యవసాయ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నాం. వారసత్వంగా వచ్చిన జీరాయితీ భూములు చాలా తక్కువుగా ఉండటం వలన ఈ గ్రామంలో సర్వే నెంబర్ 1/1లో గల ప్రభుత్వ భూమిని తరతరాలుగా సాగు చేసుకుంటు జీవనోపాధి పొందుతున్నాం. వ్యవసాయంతో తోటలు పెంచుకుంటూ దాని ఫలసాయంతో కుటుంబపోషణతోపాటు పిల్లలు చదువులు వివాహాలు వైద్యం తదితర అవసరాలను తీర్చుకుంటు కుటుంబాలను నెట్టికొస్తున్నాం. ఐ హబ్‌లకు గ్రేహౌండ్స్‌కు కేటాయిస్తే సుమారు 120 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాయి. దయచేసి న్యాయం చేస్తారని కోరుతున్నాం.

ప్రజావాణికి 273 ధరఖాస్తులు...
విశాఖపట్నం, నవంబర్ 19: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం (ప్రజావాణి) కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ వినతులను అధికారులకు సమర్పించారు. సోమవారం మీ కోసం కార్యక్రమానికి 273 ధరఖాస్తులు వచ్చాయి. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జీ.సృజన, జేసీ-2 డాక్టర్ సిరి, డిఆర్‌ఓ చంద్రశేఖరరెడ్డి, ఆర్డీఓ తేజ్ భరత్ పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి స్వయంగా వినతులను స్వీకరించారు. గృహాలు, రేషన్‌కార్డులు, భూ వివాదాలు, పించన్ల మంజూరు, ఇతర సమస్యలకు సంబంధించిన విజ్ఞాపనలను సమర్పించారు. మీ కోసం కార్యక్రమంలో వివిధ శాఖలకుచెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా 13్ఫన్‌కాల్స్ వచ్చాయి. జేసీ-2 సిరి ఫోన్‌కాల్స్‌లో ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. తద్వారా సమస్యల పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటు పడాలి
గాజువాక, నవంబర్ 19: ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడాలని ఎపి యునైటెడ్ టీఛర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షాబ్జి అన్నారు. పెదగంట్యాడలో యూనియన్ జాజులు అధ్యక్షతన సోమవారం యుటిఎఫ్ జిల్లా మహాసభ, జిల్లా కార్యవర్గం ఎన్నిక జరిగాయి. ఈ మహాసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఉపాధ్యాయ సమస్య పరిష్కారానికి నిర్విరామంగా పోరాటం సాగించి మృతి చెందిన నాయకులకు రెండు నిమిషాలు వౌనం పాటించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇష్టాగోష్టి చర్చి జరిగిన తరువాత జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. యూనియన్ జిల్లా అధ్యక్షునిగా ఎండి జాకీర్ అలీ, ప్రధాన కార్యదర్శిగా జి.చిన్నబ్బాయి, ఉపాధ్యక్షులుగా రాంబాబు, అనంతగిరి, శ్రీలక్ష్మి, కోశాధికారిగా ఎస్.పద్మ, జాయింట్ సెక్రటరీగా సనపల నాగరాజు, చిట్టయ్య, రాజేష్, నీలకంఠం, జి.జగదీష్, ఎం.రామకృష్ణ, ఎ.విజయకుమారి, ఎ.పైడిరాజు, కె.రఘునాద్, అడిట్ కమిటీ సభ్యులుగా ఎస్‌కె స్వామి, రవికుమార్ రాంబిల్లి, చిట్టిబాబు, ఎన్.ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా కెకె జాజులు, టి.అప్పారావు, రాజేంద్రకుమార్, నాగమణి ఎన్నిక కాగా ఎన్నికల అధికారిగా షేక్ షాబ్జి వ్యవహరించారు. అనంతరం జరిగిన మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎటువంటి అన్యాయం జరిగినా యూనియన్ చూస్తు ఊరుకోదన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో యూనియన్ బలోపేతానికి మరింత కృషి చేయాలని అన్నారు. యూనియన్ సభ్యత్వాలను పెంచాలన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.ప్రభాకరరావు, రామకృష్ణ, అప్పారావుతో పాటు జిల్లాలో గల అన్ని మండలాలకు చెందిన యూనియన్ నాయకులు పాల్గొన్నారు.