విశాఖపట్నం

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంట్రాక్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 19: జీవీ ఎంసీ పరిధిలోని అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లుంతా తమ పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. జీవీ ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులంతా సమ్మెలో భాగంగా నాల్గొవ రోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు వీరారెడ్డి, గొంప చంద్రవౌళీ మాట్లాడుతూ జీ ఎస్టీ అమలు జరపటంలో లోపాలను అధికమించి, తక్షణమే చిక్కుముళ్లును విప్పాలని డిమాండ్ చేశారు. కేవలం బోర్డు ఆఫ్ ఇంజనీర్స్ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో నేడు కోట్లాది రూపాయాలు వెచ్చించి పనులు చేపడుతున్న కాంట్రాక్లర్లుంతా తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నామన్నారు. తక్షణమే పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్లుకు న్యాయం చేసే విధంగా జీవీ ఎంసీ కమిషనర్, చీఫ్ ఇంజనీర్, రాష్ట్ర పట్టణ పురపాలిక శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే వరకూ తమ సమ్మెను కొనసాగిస్తామన్నారు. సమ్మె చేపట్టి నాలుగు రోజులు గడుస్తున్నా నేటికి జీవీ ఎంసీ అధికారులు కనీస స్పందించకపోవడం సరికాదున్నారు. కాంట్రాక్టర్లుంతా ఒక్కసారిగా పనులు నిలిపివేయడంతో నగరంలో సుమారు రూ.300 కోట్ల వరకూ అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాయ్యన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవధ్యక్షుడు నారాయణరెడ్డి, కన్వీనర్ రాజన వెంకటరావు, ఉపాధ్యక్షడు సాధురావు, వీరభధ్రరావు, జాయింట్ సెక్రటరీ పీవీ సత్యం, కోశాధికారి నరసింగరావు, నాయకులు అప్పన్న, దేవుడు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కనె్వన్షన్ సెంటర్ పరిశీలించిన ఏయూ వీసీ
జగదాంబ, నవంబర్ 19: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రధాన కార్యక్రమం జరిగే బీచ్‌రోడ్డులోని ఏయూ కనె్వన్షన్ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్దం చేస్తున్నారు. వచ్చే నెల 10వ తేదిన నిర్వహించే పూర్వ విద్యార్థుల సమ్మెళానానికి ముఖ్య అతిథిగా రతన్‌టాటా హజరవుతున్న విషయం విధితమే. దీనితో సమావేశానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని, దానికి తగిన విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమ్నగ్యమయ్యారన్నారు. సోమవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు సదస్సు ఏర్పాట్లును స్వయంగా పరిశీలించి, వేదిక, ప్రాంగణాలను ముందుగానే సిద్దం చేసుకొవాలని, అవసరమైన ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి దిశానిర్థేశం చేశారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామ్మోహన్‌రావు, సెనేట్ సభ్యులు డాక్టర్ కుమార్‌రాజ, ఆచార్య వజీర్ మహమ్మద్, ఆచార్య విశ్వనాథ కుమార్ తదితరులు పాల్గొన్నారు.