విశాఖపట్నం

విద్యారంగంలో మార్పులు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 19: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందిస్తున్న విద్యా విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు అన్నారు. నగరంలోని ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో సోమవారం నేషనల్ స్డూడింట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ) ఆధ్వర్యంలో ప్యూచర్ ఆఫ్ ఇండియా అనే పేరిట విద్యార్థులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ నేడు దేశ జనాభాలో ఉన్నవారంతా 50శాతం మంది యువతీ,యువకులేనన్నారు. దేశ భవిష్యత్‌ంతా యువత చేతిలోనే ఉందని, విద్యారంగంలో మార్పులు రావడంతో భవిష్యత్ తరాల వారికి ఎంతో మేలు చేకురుతుందిన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎనిమిదో తరగతి వరకూ అందరికీ ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రైట్ టూ ఎడ్యుకేషన్ చట్టాన్ని అమలు చేశామన్నారు. ముఖ్యంగా పాఠశాల,కళాశాల, ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వౌలికవసతుల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అదే విధంగా వర్శిటీల్లో విద్యార్థులకు ఇంటర్నెట్ సేవలను పూర్తిస్థాయిలో అందించడంతో పాటు,విద్యార్థులకు ఫీజులు, ల్యాబ్ అవసరాలను సకాలంలో అందించాలన్నారు. యుపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ విద్యావిధానంలో ఎటువంటి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశ ఆదాయ వనరుల్లో విద్యకు కేవలం మూడు నుంచి నాలుగుశాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని, ఆయా శాతాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ ఐసీయు జాతీయ ఇన్‌చార్జి రీషిగుప్తా మాట్లాడుతూ పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే లక్ష్యంతో గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులకు ఎటువంటి సేవలందుతున్నాయే అనే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. విద్యారంగంలో నాణ్యతతో కూడిన విద్యనందించాలని అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యనుభ్యసిస్తున్న వారిలో 17శాతం మంది ఆయా చదువును వినియోగించుకుంటున్నారనే తప్ప మిగిలిన వారంతా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యల తక్షణ పరిష్కారానికి యూత్ క్లబ్‌లు ఏర్పాటుతో విద్యారంగం అభివృద్ధితో పాటు, తక్షణ పరిష్కార మార్గాలు దోరుకుతాయన్నారు. గతంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వృత్తి ఉపాధి కోర్సులను నిర్వహించి వారిని మరింతగా ప్రోత్సహించామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, మహిళా నాయకురాలు పేడాడ రమణ కూమారి, ఎన్ ఐసీయు ప్రతినిధులు హేమంత్ కుమార్,పలువరు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యాశ్రీ పథకానికి సీఎంఆర్ మూడు లక్షలు వితరణ
జగదాంబ, నవంబర్ 19: జీవీఎంసీ పాఠశాల్లో పదో తరగతిలో అత్యథిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ కళాశాల్లో విద్యనందించడానికి ప్రోత్సాహకంగా సీఎంఆర్ సంస్థ సామాజిక బాధ్యతగా మూడు లక్షల రూపాయాల చెక్కును కమిషనర్ హరినారాయణన్‌కు సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థల అధినేత మావురి వెంకట రమణ,బాల్యం ప్రాజెక్టు ఆఫీసర్ రత్నకుమార్, మాడా, అదనపు కమిషనర్(ఫైనాన్స్) విజయ మోనాహర్ తదితరులు పాల్గొన్నారు.