విశాఖపట్నం

సంప్రదాయంగా గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 6: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో గరుడ సేవ గురువారం సంప్రదాయంగా జరిగింది. ఆర్జిత సేవగా జరిగిన గరుడ సేవలో భాగంగా సింహాచలేశుని ఉత్సవమూర్తులైన గోవిందరాజుస్వామి వారిని గరుడాళ్వార్ పై అధిష్టింపజేసి అర్చకులు అష్టోత్తరశతనామార్చన చేసారు. గరుడ సేవలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేష వస్త్రాలు,ప్రసాదాలు ఇచ్చి అర్చకులు ఆశీర్వదించారు.
అప్పన్నస్వామిని దర్శించుకున్న ప్రముఖులు
సింహాచలం, డిసెంబర్ 6: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వీ.ప్రభాకర్‌రెడ్డి, సినీ నిర్మాత శిరీష్, ప్రోకబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దేవాలయ అధికారులు వీరికి స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రముఖులు మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు వీరి పేరున సంప్రదాయ పూజలు చేసి ఆశీర్వదించారు. అధికారులు వీరికి ప్రసాదాలు అందించారు. కాగ తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టును చూసేందుకు భక్తులు పోటీపడ్డారు ముఖ్యంగా రాహుల్ చౌదరీతో సెల్ఫీలు తీసుకున్నారు. సభ్యులందరూ అభివాదం చేయగా భక్తులు వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
విజయవంతంగా కొనసాగుతున్న దివ్యదర్శనాలు
సింహాచలం, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన దివ్యదర్శనం పథకం విజయవంతంగా కొనసాగుతోంది. దేవదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆదేశాలానుసారం సింహాచలం దేవస్థానం అధికారులు ఈ బృందాలకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత దర్శనాలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖజిల్లా జీ.శిడగాం ప్రాంతానికి చెందిన భక్తబృందం గురువారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అధికారులు వీరందరికీ స్వాగతం పలికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. ఉచిత ప్రసాదాలు అందించడంతో పాటు అన్నదానం భవనంలో ప్రత్యేకంగా అనినప్రసాద ఏర్పాట్లు చేసి సాగనంపారు.
విజినిగిరిపాలెం హోం గార్డుకి బహుమానం
సింహాచలం, డిసెంబర్ 6: విశాఖనగరంలో జరిగిన హోం గార్డ్సు రైజింగ్ డే వేడుకల్లో భాగంగా అడివివరం పరిధిలోని విజినిగిరిపాలెం ప్రాంతానికి చెందిన మహిళా హోం గార్డు విజినిగిరి సావిత్రి క్రీడా విభాగంలో బహుమతి సొంతం చేసుకుంది. పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చేతుల మీదుగా ఆమె బహుతి స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను అభినందించారు.
నేడు సోలార్ ప్లాంట్‌ని సందర్శించనున్న ఐఏఎస్ బృందం
సింహాచలం, డిసెంబర్ 6: హర్యాన ప్రభుత్వానికి చెందిన ఐఏఎస్‌ల బృందంతో పాటు పలువురు అధికారులు శుక్రవారం సింహాచలం దేవస్థానంలోని వన్ మెగావాట్స్ సోలార్ విద్యుత్‌ప్లాంట్‌ని సందర్శించనున్నట్లు సమాచారం అందింది. వీరంతా కృష్ణాపురంలోని సోలార్ విద్యుత్‌ప్లాంట్‌ని సందర్శించడంతో పాటు సింహగిరికి వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారని దేవస్థానానికి సమాచారం వచ్చింది.

రేపు వరాహ పుష్కరిణీలో పాఢ్యమి దీపోత్సవం
సింహాచలం, డిసెంబర్ 6: కొడ దిగువన ఉన్న శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి పుష్కరిణీలో శనివారం పోలి పాఢ్యమి దీపోత్సవం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం నుండి పాఢ్యమి గడియలు వస్తున్న నేపథ్యంలో ఈ వేడుకను శనివారం ఉదయం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దేవస్థానం పుష్కరిణీ వద్ద దీపోత్సావానికి అవసరమైన ప్రథమిక ఏర్పాట్లు చేసారు. శుక్రవారం అర్థరాత్రి నుండి భక్తుల తాకిడి మొదలవుతుందని గత అనుభవాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అధికారులు పుష్కరిణీ ప్రాంగణమంతా విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేసారు. రాత్రి నుండి పుష్కరిణీ రహదారిలో వాహనాల రాకపోకల పై ఆంక్షలు విధిస్తున్నారు. దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని దిపోత్సవంలో పాల్గొనాలని అధికారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.