విశాఖపట్నం

సందేహాస్పద ఓటర్లపై విచారణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఓటర్ల జాబితాలో సందేహాస్పదంగా గుర్తించిన 2,00,767 ఓటర్లలో 1,19,244 ఓట్లపై ఎటువంటి అనుమానాలు లేనట్టు నిర్ధారించామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆర్‌పీ సిసోడియా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈ అంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా సందేహాస్పదంగా ఉన్న 26,822 ఓటర్లను రానున్న రెండు రోజుల్లో విచారించనున్నట్టు తెలిపారు. వీటిలో 564 ఓట్లు డోర్ లాక్డ్‌గాను, 933 ఓట్లు పర్సన్ నాట్ రెసిండెంట్‌గాను, 464 ఓట్లు పర్సన్ నాన్ అవైలబుల్‌గాను, 1,992 ఓట్లు మరణించినట్టు, 4,667 ఓటర్లు ఇల్లు మారినట్టు, 4,681 ఓట్లు రీ ఎంట్రీలుగా గుర్తించామన్నారు. అలాగే 471 ఫొటో సవరణకు, 4,138 మంది పేర్ల సవరణకు, 33,976 మంది ఇంటి చిరునామా సవరణకు, 1.230 మంది బంధుత్వ సవరణకు, 163 మంది లింగ సవరకు, 1,369 మంది వయసు సవరణకు, 53 మంది రిపీటెడ్ సవరకు గుర్తించి సరిదిద్దడం జరిగిందన్నారు. అలాగే సూక్ష్మ క్లైమ్స్ అండ్ అబ్జక్షన్స్‌ర పరిష్కారానికి వివరాలను కలెక్టర్ వివరిస్తూ ఫారం 6లో అందిన 1,57,035 వినతులను, ఫారం 6ఎలో అదిన 187లో 69 వినతులను, ఫారం 7లో అందిన 18,060లో 15,121 వినతులను, ఫారం 8లో అందిన 28,108లో 17,277 వినతులను, ఫారం 8ఎలో అందిన 7,238లో 6,645 వినతులను ఇప్పటి వరకూ పరిష్కరించామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా మాట్లాడుతూ సందేహాస్పంద ఓటర్లు, క్లైమ్‌లు, అభ్యంతరాలు ఎప్పటి కప్పుడు సీఈఓ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో జేసీ జీ సృజన, జేసీ 2 డాక్టర్ సిరి తదితరులు పాల్గొన్నారు.