విశాఖపట్నం

భూ సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 11: పంచగ్రామాల ప్రజలకు, దేవస్థానానికి మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారం కోరతూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర జరిగింది. ‘ఎన్నాళ్లు ? ఇంకెన్నాళ్లు ?’ అంటూ సమస్య పరిష్కారంలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ.. బ్యానర్లు ప్రదర్శించకుంటూ పాదయాత్ర నిర్వహించారు. సింహాచలేశుని తొలిపావంచా నుండి గోపాలపట్నం పెట్రోల్ బంకు వరకు పాదయాత్ర నిర్వహించారు.1996లో ప్రభుత్వం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలను రద్దు చేయాలని అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పట్టాలను రద్దు చేయాలని సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేసారు. 1996లో ప్రభుత్వం తప్పుడు పట్టాలు ఇచ్చిన విషయాన్ని శాసన సభలో ఎమ్మెల్యేలు ప్రశ్నించిన అంశాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసారు. ఈ నేపథ్యంలో పట్టాలు రద్దుచేసి ఖాళీ స్థలాలు, ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని నేతలు డిమాండ్ చేసారు. సంక్షేమ సంఘం నాయకులు టీవీ.కృష్ణంరాజు, వైకే.నాయుడు, కే.సన్యాసిరావు, సిహెచ్.కామేశ్వరరావు, సత్యనారాయణ, సిహెచ్‌ఎస్‌ఎస్.గోపాలకృష్ణ, వై.నాగేశ్వరరావు, ఎస్.రాజు, ఎంవీ.ప్రసాద్ బాధితులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గాజువాక, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని 56వ వార్డు టిడిపి నాయకులు బలిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. అగనంపూడి కాలనీకి చెందిన నక్క బాల మృతి చెందారు. ఆమె చంద్రన్న భీమా పథకంలో చేరడంతో ఆమెకు రెండు లక్షల రూపాయిలు మంజూరయ్యాయి. మంజూరైన వాటిలో మంగళవారం 5వేల రూపాయిలను మృతుని భర్త నక్క గోవింద్‌కు అందజేశారు. మిగిలిన ఒక లక్ష 95వేల రూపాయిలను బ్యాంక్‌లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. చంద్రన్న బీమా పథకం అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలను దృష్టిలో ఉంచుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. . ఈ కార్యక్రమంలో స్ధానిక పెద్దలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యకర సమాజానికి కృషి చేయాలి
గాజువాక, డిసెంబర్ 11: ఆరోగ్యంగా ఉన్నపుడు సమాజం ప్రగతి పథంలో ముందుకు దూసుకు పోతుందని విఎస్‌ఇఎజ్ డవలప్‌మెంట్ అధికారి ఫణి అన్నారు. మంగళవారం దువ్వాడ విఎస్‌ఇజెడ్ యూనిట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోబెల్ బెల్లోస్ పెనీలో మంగళవారం ఉచిత కేన్సర్ వైద్య శిబిరం ఏర్పాటైంది. ఈ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కంపెనీలో పని చేస్తున్న మహిళ ఉద్యోగుల ఆరోగ్య విషయమై ప్రత్యేకంగా కేన్సర్ వైద్య శిబిరం ఏర్పాటైందన్నారు. ఈ వైద్యశిబిరంలో 25 సంవత్సరాలు దాటిన మహిళ ఉద్యోగులు ఎటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నారో తెలుసు కోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బెస్ట్ కేన్సర్ సమస్యతో ఎక్కువ మంది మహిళలు బాధ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులు సుభద్ర, సౌమ్య, అనితరాజ్ తదితరులు సుమారు 800 మహిళ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
ఇబ్బంది లేకుండా టీఎంసీ అమలు
గాజువాక, డిసెంబర్ 11: ఉక్కులో యాజమాన్యం అమల్లోకి తీసుకు వచ్చిన టోటల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ (టిఎంసి) పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసిందని సిటు,ఎఐటియుసి, ఇంటక్ నాయకులు పేర్కొన్నారు. టిఎంసి విధానం అమలుతో ఇటీవల సుమారు 74 మంది కాంట్రాక్టు కార్మికులు పనిని కోల్పోయి రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని తక్షణమే ఎత్తివేయాలని కార్మికులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈనేపధ్యంలో ఇంటక్, సిటు, ఎఐటియుసి కార్మిక సంఘాల నాయకులు మంగళవారం ఉక్కు అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విధానాన్ని తక్షణమే ఎత్తివేసి తమను తిరిగి పనిలో పెట్టుకోవాలని ఉక్కు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన చేస్తున్న పనుల్లో కూడా ఉక్కు యాజమాన్యం టిఎంసిని అమలు చేయడం మంచిది కాదన్నారు. కార్మిక సంఘాల విజ్ఞప్తికి స్పందించిన యాజమాన్యం టిఎంసిని అక్కడ అమలు చేయకపోయినా కాంట్రాక్టు పనుల విషయంలో వెలుసుబాటు కల్పించకపోగా 74 మందిని పనిలో నుండి తొలగించి కొత్తవారిని నియమించడంతో కార్మికులు గుర్రుగా ఉన్నారన్నారు. టిఎంసి విధానం వలన కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఉక్కు అధికారి ఈ విధానాన్ని ఎత్తివేస్తామని, పాత పద్దతినే కొనసాగిస్తామని చెప్పినట్లు నాయకులు పేర్కొన్నారు.
తప్పు చేస్తే శిక్షించాల్సిందే
గాజువాక, డిసెంబర్ 11: ఎంతటి వారైనా తప్పు చేసేవారిని శిక్షించి తీరాలని వైసిపి గాజువాక నియోజక వర్గం కన్వీనర్ తిప్పల నాగిరెడ్డి అన్నారు. పెదగంట్యాడ ప్రధాన కూడలిలో ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరహార దీక్ష శిబిరంలో తిప్పల నాగిరెడ్డి, దళిత నాయకులు పాల్తేటి పెంటారావు, నాగమణి, సూర్యం, అప్పారావు, కృష్ణ తదితరులతో పాటు స్ధానిక బాబూజగ్జీవన్‌రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్య జఠిలం కాకుండా ఉండాలంటే అధికారులు దోషులను గుర్తించి చట్టం నిలబెట్టాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి రోజులు గడిచి పోతున్నా పోలీసు యంత్రాంగం మీన మీషాలు లెక్కిస్తుందంటే దీని ఆంతర్యమేమిటో బయట పడుతుందన్నారు. దోషులు ఎవరన్నది తేలే వరకు నిరహార దీక్ష శిబిరం కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని ఉదృథం చేయాల్సిందేనని అన్నారు. అధికారులు స్పందించి బాధ్యులను గుర్తించి సమస్య పెద్దది కాకుండా చూడాలన్నారు. పలువురు నాయకులు దళితులకు సంఘీబావం తెలిపారు.