విశాఖపట్నం

విశాఖను వణికిస్తున్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: నాలుగైదు రోజులపాటు తగ్గిన చలి మళ్ళీ పెరిగింది. విశాఖ విమానాశ్రయంలో రెండు రోజుల నుంచి దాదాపు 20డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి కాస్త పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ లంబసింగి, చింతపల్లి, అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, సీలేరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12కి పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖను దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీనికి కాలుష్యం తోడుకావడం, గాలిలో తేమ శాతం పెరగడం వంటి కారణాలతో రోగులకు అవస్థలు తప్పడంలేదు. పగలు సైతం వాతావరణం చల్లబడుతోంది. రానున్న రోజుల్లో ఇదికాస్త పెరగవచ్చని, ఈ నెలాఖరికి పెరిగి వచ్చేనెల సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత ఉంటుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి పేర్కొంది. నైరుతీ బంగాళాఖాతం దానిని ఆనుకున్న ఉన్న హిందూ మహాసముద్రం వద్ద అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో చలి తీవ్రత తగ్గే అవకాశాలున్నట్టు ఈ కేంద్రం తెలియజేసింది. కాగా ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టమైన పొగమంచు వీడకపోవడంతో వాకర్స్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
వయ్యారి నడకలతో ఊరేగిన వరాహ నారసింహుడు
సింహాచలం, డిసెంబర్ 11: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో అధ్యాయనోత్సవాలలో భాగంగా జరుగుతున్న పగల్‌పత్ వేడుకల్లో మంగళవారం స్వామివారు వయ్యారి నడకలతో ఊరేగారు. సింహాచలేశుని ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజుస్వామి వారిని అమ్మవార్లను సర్వాభరణాలతో అలంకరించి పల్లకిలో వేంచింపజేసారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ బేడా మండపంలో వయ్యారి నడకలతో స్వామివారిని ఊరేగించారు. ఆస్థాన మండపంలో అధిష్టింపజేసి విశేష పారాయణలు, శాత్తుమొరై నిర్వహించారు.
నేడు రెండో విడత నృసింహ దీక్షలు
సింహాచలం, డిసెంబర్ 11: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో రెండో విడత నృసింహ దీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల మూడో తేదీన తొలివిడత 40 రోజుల మండల దీక్షలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. 32 రోజుల దీక్షలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఈ విడతలో గిరిజన ప్రాంతాల్లోని భక్తులకు దీక్షలు అచరింపజేయించే ఉద్దేశంతో దేవస్థానం బృందాన్ని మంగళవారం పంపించారు. సహాయ కార్యనిర్వాహణాధికారులు ఆర్వీవీ ఎస్.ప్రసాద్, నక్కాన ఆనందకుమార్ నేతృత్వంలో బృందం ప్రత్యేక వాహనంలో మన్యానికి వెళ్లారు. దీక్షలు స్వీకరించే గిరిజనులకు దీక్షావస్త్రాలను, మాలలను దేవస్థానం ఉచితంగా అందజేయనుంది. సింహగిరి పై దీక్షలు తీసుకోనున్న భక్తులకు దేవస్థానం నృసింహ మండపంలో ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు దీక్షలు ప్రారంభించనున్నారు.