విశాఖపట్నం

సరకు రవాణాకు చలి భయం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్ అంటే భారతీయరైల్వేకే ఆర్ధిక వెన్నుముక. అందువలనే అవార్డుల పంట పండిస్తోంది. ఫలితాలు సాధించడంలోను, ఆదాయ లక్ష్యాల్లో వాల్తేరుడివిజన్‌కు మించింది లేదు. భారతీయరైల్వే పరిధిలో కొంకణ్ రైల్వేతో 17 రైల్వేజోన్లు ఉన్నా, వీటి పరిధిలో ఏకంగా 48డివిజన్లు నడుస్తున్నా వాల్తేరుడివిజన్‌కున్న ప్రత్యేకతే వేరు. అయితే తొలి నుంచి ఈ డివిజన్‌కు పుట్టెడు కష్టాలు... వీటిని తీర్చడం రైల్వేబోర్డుకే సాధ్యపడటంలేదు. రైల్వేకు గుండెకాయ వంటిదైన కిరూండల్ రైల్వే మార్గంలోనే సరుకు రవాణా జరుగుతుంది. దేశ నలుమూలలకు సరుకు తీసుకువెళ్ళే గూడ్స్ రైళ్ళు ఒకపుడు రోజుకీ ఏకంగా 30నుంచి 40 వరకు ఉండేవి. అటువంటిది ఇవి క్రమేపీ సగానికి పైగా పడిపోయాయి. కొన్ని సందర్భాల్లో పది కంటే కూడా నిర్వహించలేని పరిస్థితులుంటున్నాయి. దీనికి ప్రధానంగా రైలు పట్టాలమీద తరచూ కొండ చరియలు విరిగిపడటం, రైల్వేట్రాక్, బ్రిటిష్ కాలంనాటి బ్రిడ్జిలు దెబ్బతినడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. ఎక్కువుగా చలికాలంలో కొండ చరియలు విరిగిపడుతుండగా, వర్షాకాలంలో రైల్వేట్రాక్, బ్రిడ్జిలు, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడం సాధారణమవుతుంది. వీటిని బయటపడే క్రమంలో ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్ తీసుకుంటున్న చర్యలు అనేకం. అయినా ఇవేమీ ఫలితాలనివ్వడంలేదు. కొండచరియలు విరిగిపడినా, రైల్వేట్రాక్ దెబ్బతిన్నా సంబంధిత మార్గాన్ని ఆధునీకరించడం పెద్ద సమస్యగా మారుతోంది. అలాగే అనేక రకాలుగా కోట్లాది రూపాయల మేర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని రైల్వేవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రతి ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు తుపాన్లు, భారీ వర్షాలతో వాల్తేరుడివిజన్ నష్టాలను ఎదుర్కొంటుండగా, ఈ సీజన్ డివిజన్‌ను భయపెడుతోంది. అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తీవ్ర చలి ప్రభావం ఉండే తూర్పుకనుమల్లో రైల్వేట్రాక్‌పైనే కొండ చరియలు విరిగిపడుతుంటాయి. వీటిని తొలగించేందుకు భారీగా యంత్రాలను, కార్మికులను ఉపయోగించాల్సి వస్తోంది. ఒకవైపు పునరుద్ధరణ పనులు జరుగుతున్న రోజుల్లో గూడ్స్‌లు, పాసింజర్ రైళ్ళు రద్దువుతుండంతో ఈ విదంగానే కోట్లాది రూపాయల మేర నష్టపోతుండగా, పునరుద్ధరణ పనులకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. చలికాలం, వర్షాకాలంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులుండగా, ఈ మార్గంలోనే అనేక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్నాయి. రైల్వేస్టేషన్లు, కార్యాలయాలు, క్రాసింగ్‌ల వద్ద నిత్యం ఎటువంటి సంఘటనలు జరుగుతాయా? అనే భయంతోనే రైల్వేవర్గాలు బిక్కుబిక్కుమంటూ పనిచేస్తుంటాయి. బంద్‌లకు పిలుపునిచ్చిన సందర్భాల్లో ఏకంగా వారం రోజులపాటు గూడ్స్‌లు, పాసింజర్లు రద్దు ఉంటుంది. అనేక రకాలుగా నష్టపోతున్న వాల్తేరుడివిజన్‌లో నెలకొన్న ఈ సమస్యలు దీర్ఘకాలంగా ఉంటున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రమాద సంఘటనలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకుగాను దాదాపుగా వంద కోట్ల వెచ్చించి శాటిలైట్ సర్వేను నిర్వహించారు. దీని తరువాత శాశ్వత పరిష్కారానికి రైల్వేబోర్డు స్థాయిలో నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఈ సమస్యలన్నీ కిరండూల్ మార్గానికి శాపంగా పరిణమిస్తున్నాయి.
* భయపడుతున్న ఉద్యోగులు...
కిరండూల్ మార్గంలో అరకు, అనంతగిరి, బోర్రాగుహలు, దత్తెవడ, హుకుంపేట, తైడ, జగదల్‌పూర్, కిరండూల్ తదితర పలు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల మార్గంలో సగానికిపైగా సమస్యాత్మక రైల్వేస్టేషనే్ల. రైల్వేక్రాసింగ్‌లు, బ్రిటిష్‌కాలంనాటి భారీ బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్లు, కార్యాలయాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో రైల్వే కార్మికులు, ఉద్యోగులు, అధికారులు పనిచేసేందుకు భయపడుతున్నారు. ఏ క్షణంలో ఏమీ జరుగుతుందోనన్న గుబులతోనే విధులు నిర్వహిస్తుంటారు. ఈ మార్గంలో పనిచేసేందుకు ఇష్టపడని కొంతమంది బదిలీపైన వెళ్ళిపోతుండగా మరికొంతమంది స్వచ్ఛంధ పదవీ విరమణకు సైతం సిద్ధపడుతున్నారు. సరైన వైద్య,విద్య సదుపాయాలు, నివాసిత కాలనీల్లో వౌలిక వసతులు కల్పించకపోవడం రైల్వే ఉద్యోగులకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.